పరోపకారం!
పరోపకారం!


ఒక ఊరిలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. ఆ ఊరిలో పని దొరకక
పోవడంతో బ్రతుకడం కష్టమైంది. ఒక రోజు వేరే ఊరికి ప్రయాణం అయ్యాడు. ఒక పొలం గుండా వెళ్తుంటే ఒక పాడుబడ్డ బావిలోంచి "కాపాడండీ! కాపాడండీ" అనే అరుపులు వినిపించాయి. దగ్గరికి వెళ్లి చూచాడు. ఎలా కాపాడాలో తెలియలేదు. అయితే ఒడ్డున పెద్ద మర్రిచెట్టు ఉన్నది. దాని ఊడలు అన్ని కట్టగా బావి దగ్గరికి చేర్చి,బావిలోకి జార విడిచాడు. అవి పట్టుకొని ఆ వ్యక్తి పైకి వచ్చాడు. రామయ్యకు ధన్యవాదాలు తెలిపాడు. రామయ్య పరిస్థితిని తెలుసుకున్నాడు. "తాను పెద్ద వ్యాపారస్తుడినని, తన దగ్గర పని చేయొచ్చును" అని చెప్పాడు. రామయ్యకు ప్రాణం లేచి వచ్చింది. "మనం ఒకరికి సహాయం చేస్తే ఇంకొకరు తప్పకుండా మనకి సహాయం చేస్తారు అని తెలుసుకున్నాడు. వ్యాపారస్తుడి దగ్గర పనిలో కుదిరి జీవితాన్ని తృప్తిగా గడిపాడు.