స్నేహమేరా జీవితం..
స్నేహమేరా జీవితం..


శశి ,కార్తీక్ అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. వాళ్ళు ఎప్పుడూ కలిసి మెలిసి ఉండేవారు. అలానే శివ అనే అబ్బాయి కూడా ఉండేవాడు. శివకు శశి, కార్తీక్ లు అంటే ఇష్టముండడు. ఒకరోజు నవీన్ అనే అబ్బాయి కొత్తగా పాఠశాలకు వచ్చాడు. నవీన్ చాలా అమాయకుడు. అప్పుడే నవీన్ కు శివ పరిచయమయ్యాడు. శివ నవీన్ కు మాయమాటలు చెప్పి తనతో స్నేహం చేయమన్నాడు. మరుసటి రోజు శశి ,కార్తీక్ లు, "ఎవరబ్బా!ఈ కొత్త అబ్బాయి?" అని నవీన్ వైపు చూశారు. వెంటనే శివ వచ్చి "వీళ్లిద్దరూ మంచి వాళ్ళు కాదు, నిన్ను చెడగొడతారు" అని తప్పుగా చెప్పాడు. నవీన్, శివ మాటలను పూర్తిగా నమ్మాడు. మధ్యాహ్న భోజన సమయం అయింది. నవీన్ తెచ్చుకున్న బాక్స్ ను ఎవరో దొంగలించారు. ఆకలితో ఏడుస్తున్నాడు. అది చూసిన శశి తన బాక్స్ ను నవీన్ కి ఇచ్చి తినమన్నాడు. అయినా నమ్మక తినలేదు. ఇలా రెండు రోజులు గడిచాయి. ఒకరోజు బారీ వర్షం పడింది.
నవీన్ వాళ్ళది రేకుల ఇల్లు. వర్షంతో తడిసి కూలిపోయింది. దాంతో నవీన్ వాళ్ళ కుటుంబం అంతా రోడ్డున పడ్డారు. అప్పుడే శశి, కార్తీక్ లు , ఇద్దరూ నవీన్ వాళ్ళ ఇంటి వైపు వెళ్లారు. అక్కడ చూసిన నవీన్ ని శశి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి, ఆశ్రయం ఇచ్చారు. నవీన్ ఏడుస్తూ", మీకు చాలా ధన్యవాదాలు. మిమ్మల్ని నేను తప్పుగా ఊహించుకున్నాను కానీ ఈరోజు మా కుటుంబాన్నే కాపాడారు"అన్నాడు. నువ్వు మా స్నేహితుడివి. మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నా ఫర్వాలేదు, కానీ శివ నిన్ను మోసం చేయాలనుకున్నాడు ఆరోజు నీ బాక్స్ కూడా వాడే దొంగలించాడు. నువ్వు వచ్చిన రోజే నీ గురించి అంతా తెలుసుకుని నీ మీద ఒక కన్నేసి ఉంచాము" "అన్నారు శశి ,కార్తీక్ లు. నవీన్ కు ఏడుపు ఆగలేదు. ఇంత మంచి స్నేహితుల్ని వదిలి వాడితో స్నేహం చేశానా?"స్నేహితులు అంటే మీలా ఉండాలి" అని అప్పటి నుంచి నవీన్ కూడా వాళ్ళతో స్నేహం చేశాడు.