నవ్య ది స్టార్.
నవ్య ది స్టార్.


నవ్య అనే అమ్మాయి కి హీరోయిన్ అవ్వాలని కోరిక ఉండేది. కానీ వాళ్ళది చాలా పేద కుటుంబం. నవ్య మాత్రం చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ టిక్ టాక్ లో అప్లోడ్ చేసేది. ఒక రోజు టీవీ లో ప్రకటన వచ్చింది నటన చేసే ఆసక్తి ఉన్న వారు ఈ
నంబర్ కి సంప్రదించగలరు. నవ్య ప్రకటన చూసి చాలా ఆనందపడింది. కానీ అందులో ఒక చిక్కుంది. ప్రవేశ రుసుము పదివేల రూపాయలు చెల్లించాలి. నవ్య దగ్గర అంత డబ్బులేదు. కానీ నవ్య ఇంకొకరి ఇంట్లో పనిలో చేరి ఎలాగైనా సరే కష్టపడి డబ్బు సంపాదించి
పెట్టుకుంది. నవ్య ఆడిషన్స్ కి వెళ్ళింది. కొన్ని వందల మంది వచ్చారు.కొంచెం భయం ఉన్నప్పటికీ తనపై తనకు నమ్మకం ఉందంటూ ధైర్యంతో వెళ్ళింది. నవ్య చాలా చక్కగా ప్రదర్శన చేసింది. కానీ నవ్య ని సెలెక్ట్ చేయలేదు. దాంతో నవ్య కు కొంచెం బాధ కలిగినా తనకు తాను సర్దిచెప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపో
యింది.ఇలా ఎప్పుడు ప్రకటనలు వచ్చినా ప్రతిసారీ వెళ్లి ప్రదర్శన చేసి వచ్చేది కానీ నవ్య ని మాత్రం సెలెక్ట్ చేయలేదు. నవ్య దాంతో ఇక ఆశలువదులుకొని ఇంటికి వచ్చి ఏడుస్తూ కూర్చుంది. "నాన్న ఇక నా బతుకు ఇంతేనా!"అన్నది. అప్పుడే వాళ్ల నాన్న కొన్ని పుస్తకాలు తెచ్చి నవ్య ని చదవమన్నాడు. ఆ పుస్తకాలలో సచిన్ టెండూల్కర్ , ధామస్ అల్వా ఎడిసన్ ,అబ్రహం లింకన్ ,వంటి గొప్ప మహానుభావుల చరిత్రలు ఉన్నాయి. వాటన్నిటినీ చదివింది. అప్పుడు నవ్యకు ఒకటి అర్థమయింది ప్రతి విజయం వెనుక ఒక వైఫల్యం కూడా ఉంటుందని. మళ్లీ ఒక ప్రకటన వచ్చింది.ఈసారి నవ్య చాలా చక్కగా ప్రదర్శన ఇచ్చింది.సెలెక్టర్లు నవ్య ప్రతిభను చూసి హీరోయిన్ గా ఒక సినిమాలో అవకాశం ఇచ్చారు. సినిమా చాలా పెద్ద హిట్ అయింది. దాంతో నవ్య చాలా పెద్ద స్టార్ గా ఎదిగింది. అభిమానులు నవ్యకు "ట్వింకిల్ స్టార్" అని బిరుదు కూడా ఇచ్చారు.