చదువు అంటే మార్కులు కాదు!
చదువు అంటే మార్కులు కాదు!


వంశీ,కార్తీక్, అనే ఇద్దరు విద్యార్థులు ఉండేవారు. ఇద్దరు పదవ తరగతి చదువుతున్నారు.వంశీ ప్రభుత్వ పాఠశాలలో, కార్తీక్ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారు. పదవ తరగతి పరీక్షలు జరిగాయి. వంశీకి 60 శాతం మార్కులు వచ్చాయి. కార్తీక్ కు 100 శాతం మార్కులు వచ్చాయి. ఆ మార్కులు వాళ్ల తల్లిదండ్రులకు చూపించారు. వంశీ వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఆనందంగా వంశీని అభినందించారు. కార్తీక్ వాళ్ళ తల్లిదండ్రులు అరేయ్ నువ్వు ప్రతిదాంట్లో 100 కి 100 శాతం మార్కులు తెచ్చుకోవాలి రా అని చెప్పారు. ఇద్దరూ పై చదువులకు వేరే ప్రాంతానికి వెళ్లి చదువు పూర్తి చేసి ఇద్దరు తిరిగి మళ్ళీ వచ్చారు. ఒక ఆఫీస్ కి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ కి వెళ్లారు. ఇద్దరకి ఒకేసారి లోపలికి పిలిచారు. అసలు విషయం ఏమిటంటే అక్కడ ఒకరికే అవకాశం ఉంది. ఆఫీసర్ ఒక ప్రశ్న అడిగాడు. ప్రశ్
న ఏంటంటే
"వాట్ ఈజ్ వాట్ ?" కార్తీక్ కు అర్థం కాలేదు! సార్ what is what ఏంటి సార్ అని అడిగాడు. వంశీ మాత్రం జాగ్రత్తగా ఆలోచించి సార్ "watt is the unit of power" అని సమాధానమిచ్చాడు. ఆఫీసర్ ఆశ్చర్యపడి ఉద్యోగాన్ని వంశీ కి ఇచ్చేశాడు.
ఇద్దరూ బయటికి వచ్చారు. కార్తీక్ చాలా బాధతో ఏడుస్తున్నాడు.
అరేయ్ ఆ క్షణంలో నువ్వు తెచ్చిన 100 మార్కులు దేనికీ ఉపయోగ పడలేదు చూసావా. మార్కులు ముఖ్యమే రా కానీ బట్టీ పట్టి చదవకూడదు. మన సామర్థ్యంతో తెచ్చుకునే ప్రతి మార్కు మనకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. చాలా ప్రైవేటు పాఠశాలల్లో ఇదే రా పరిస్థితి. మార్కులు, మార్కులు,మార్కులు, ర్యాంకులు, ర్యాంకులు, అంటూ బట్టీ పట్టి నేర్పించి పిల్లలు భవిష్యత్తు తో ఆడుకుంటున్నారు. "తల్లిదండ్రులారా ఇప్పటికైనా ఆలోచించండి,"అని చైతన్యం కలిగించారు.