శీర్షిక: డబ్బు ఒక జబ్బు !
శీర్షిక: డబ్బు ఒక జబ్బు !


రాము ,రవి, అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారిద్దరూ 9వ తరగతి చదువుతున్నారు. పాఠశాలకు కలిసే వెళ్లేవారు, ఒకే బాక్స్ లో తినేవారు, వాళ్ళ ఇద్దరిలో ఎవరు తప్పు చేసినా ఇద్దరు దెబ్బలు తినేవారు, పాఠశాలలో ఒక ఆదర్శ స్నేహితులుగా ఉండేవారు. అంత మంచిగా ఉండే వీళ్ల స్నేహంలో ఒకరోజు ఈశ్వర్ అనే కుర్రాడు చేరాడు. ఈశ్వర్ దగ్గర చాలా డబ్బు ఉండేది. తను వచ్చిన కొద్ది రోజుల్లోనే అక్కడ ఉన్న వాళ్లందర్నీ డబ్బుతో తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. అలా తన కన్ను రవి మీద పడింది. ఈశ్వర్ రవి దగ్గరికి వెళ్లి "ఇంకెన్నాళ్లు ఆ రాము దగ్గర ఉంటావు నా దగ్గరికి రా నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను "అని చెప్పాడు. రవి డబ్బుకు అమ్ముడుపోయి ఈశ్వర్ తో స్నేహం చేయడం మొదలుపెట్టాడు. మరుసటి రోజు నుంచీ రవి రాముతో కాకుండా ఈశ్వర్ తోనే పాఠశాలకు వచ్చేవాడు, ఈశ్
వర్ తోనే తినేవాడు. రాము ఇదంత ఏంటి అని అడిగితే నీ దగ్గర డబ్బు లేదు కానీ ఈశ్వర్ దగ్గర చాలా డబ్బు ఉంది అని అన్నాడు. రాముకి రవి అన్నా మాటలకు చాలా బాధేసింది. అలా కొన్ని రోజులు గడిచాక కొంతమంది పోలీసులు పాఠశాలకు వచ్చి ఈశ్వర్ అసలు రూపాన్ని బయటపెట్టారు. 2 లక్షల రూపాయిలు దొంగతనం చేసి ఇక్కడ దాక్కున్నాడు అని చెప్పి ఈశ్వర్ తో పాటు రవిని కూడా తీసుకెళ్లారు. రాముకి విషయం తెలియగానే పోలీస్ స్టేషన్ కి వెళ్లి రవిని విడిపించాడు. రవి"నన్ను క్షమించు మిత్రమా డబ్బు కోసం మన స్నేహాన్ని వదులుకున్నాను,నిన్ను ఒంటరి వాడిని చేశాను. నా కళ్ళు తెరిపించావు అన్నాడు.రాము "చివరిగా జీవితంలో ఒక్కటి గుర్తుపెట్టుకో మిత్రమా! డబ్బు ఉన్నంతకాలం బాగుంటుంది, తర్వాత కష్టపెడుతుంది,అదే అనుబంధం అయితే ముందు కష్టంగానే ఉంటుంది, కానీ ఎప్పుడు నీ వెంటే ఉంటుంది" అని అన్నాడు.