భారత దేశ చరిత్ర
భారత దేశ చరిత్ర
భారత దేశ చరిత్ర అని బోర్డు మీద వ్రాశారు కుమార స్వామి మాస్టారు.
తొమ్మిదవ తరగతి విద్యార్థినీ విద్యార్థులు అంతా ఆసక్తిగా చూస్తున్నారు.
మాస్టారు గారు! ఇప్పుడు మన దేశం బానిసత్వంలో లేము కదా.మనం దీని గురించి ఎందుకు చదువుకోవడం? మొఘలుల పాలన,బ్రిటీషు వారి పాలన ఎందుకు ఇవన్నీ తెలుసుకోవడం అని ప్రశ్న వేశాడు ఓ అబ్బాయి.
దానికి మాస్టారు నవ్వుతూ ఇలా చెప్పారు.
చాలా మంచి ప్రశ్న వేశావు అబ్బాయ్.
చరిత్ర చాలా మందికి పనికిరాని పాఠ్య పుస్తకంగా అనిపిస్తుంది.
ఇప్పుడు మీరు స్వేచ్ఛగా విహరిస్తున్న ఈ దేశం ఒకప్పుడు బ్రిటీష్ వారి పాలనలో ఎంత దుర్భర పరిస్థితులను చూసిందో మీకు తెలియకపోతే రేపు ఈ దేశం ఎదుర్
కొనే సవాళ్లకు మీరు ఎలా పరిష్కారం చూపగలరు?
దేశ భక్తి,జ్ఞానము,వారసత్వ సంపద మీద బాధ్యత మీకు ఎలా కలుగుతాయి?
పిల్లలూ! చరిత్ర అంటే ఒక రాజుకు ముగ్గురు రాణులు అతని విలాస జీవితం గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు.
అది ఈ దేశపు మట్టి కోసం ప్రాణ త్యాగం చేసిన వారి ఆశయాలను ఆచరణలో పెట్టడానికి ఒక మార్గం.
మీరు చదివేది ఏదయినా దేశానికి ఏ విధంగా మీరు ఉపయోగపడతారు అనేది ఆలోచించండి.అదే ఈ దేశానికి మీరు చేసే నిజమైన సేవ.
మాస్టారు చెప్పిన దానికి పిల్లలంతా చప్పట్లు కొట్టారు.