M.V. SWAMY

Children Stories

3.4  

M.V. SWAMY

Children Stories

మంచితనం ప్రభావం

మంచితనం ప్రభావం

2 mins
727


  


    రాజు పదో తరగతి చదువుతున్నప్పుడు అల్లరి చిల్లరిగా ఉండేవాడు. టీచర్స్ చెప్పిన మాటలు వినేవాడు కాదు, తోటి విద్యార్థినీ విద్యార్థులను రెచ్చగొట్టి ఉపాధ్యాయులను హేళన చేయించడం, పాఠాలు వినకుండా గొడవ చేయించడం చేస్తుండేవాడు.రాజు పేరు చెప్పగానే ఒక జులాయి విద్యార్థి అనే భావన పాఠశాలలో ఉండేది.ఇక్కడో విచిత్రమేమిటంటే రాజు తెలివైన చురుకైన విద్యార్థి కాకపోతే గర్వం, పొగరు, నిర్లక్ష్యం ఎక్కువగా ఉండేది.అతని తండ్రి గ్రామపెద్ద కావడంతో తనని దండించే సాహసం టీచర్స్ చెయ్యలేరు అనే ధీమా అతనిలో కనిపించేది.


              గోపి రాజు చదువుతున్న తరగతిలోనే ఉండేవాడు. అతనికి టీచర్స్ అంటే వినయ విధేయతలు ఉండేవి, పాఠశాలలో క్రమశిక్షణతో ఉండేవాడు. తెలివైన విద్యార్థి కాకపోయినా మంచి విద్యార్థి అనే పేరు గోపీకి ఉండేది. గోపి తండ్రి ఒక ప్రైమరీ స్కూల్ టీచర్, తండ్రి నేర్పిన మంచి బుద్ధులు, తరగతిలో అతన్ని మంచి విద్యార్థిగా నిలబెట్టాయి.


               రాజు తరగతులో తోటి పిల్లల పట్ల చూపుతున్న జులుం, టీచర్స్ మాటలు పట్ల చూపుతున్న నిర్లక్ష్యం గోపీకి నచ్చేవి కాదు.అందుకే మధ్య మధ్యలో రాజుకి మంచి మాటలు చెప్పి అతన్ని మార్చడానికి ప్రయత్నించేవాడు, అయినా రాజులో మార్పురాలేదు సరికదా తిరిగి గోపీని కొంతమంది ఆకతాయి మిత్రుల సాయంతో ఆట పట్టించడానికే ఉత్సాహం చూపేవాడు అతడు.


            పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మొదలయ్యాయి. రాజు,గోపి ఒకే గదిలో పరీక్షలు రాస్తున్నారు.రాజు తెలివైన విద్యార్థి అయినప్పటికీ...తరగతిలో మాల్ ప్రాక్టీస్ చేయించడానికి ప్రణాళికలు వేసుకొని, తనకి సహకరించమని గోపీని అడిగాడు గోపీ అందుకు ఒప్పుకోలేదు, పైగా మాల్ ప్రాక్టీస్ జరిగితే జిల్లా విద్యా అధికారికి పిర్యాదు చేస్తానని హెచ్చరించాడు.పరీక్షల మొదటి రోజే రాజు తన మిత్రులతో కలిసి గోపి ఇంటికి వెళ్లి గోపిని ఇంటి బయటకు రమ్మనమని పిలిచి అతనిపై చెయ్య చేసుకున్నాడు, కొడుకుపై జరుగుతున్న దాడిని అడ్డుకున్న గోపి తలిదండ్రులును కూడా కొట్టింది రాజు బృందం.


              రాజు చేసిన నేరం పాఠశాలలోనూ...చుట్టు పక్కల ప్రాంతలలోనూ తెలిసిపోయింది. గోపి తండ్రి ఉపాధ్యాయుడు కాబట్టి రాజుపై పోలీసులకు పిర్యాదు చేసి అతన్ని అరెస్ట్ చేయిస్తారని అందరూ అనుకున్నారు, కానీ అలా జరగలేదు. పరీక్షలు ముగిశాయి. పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరగకుండా గోపీ ఆపగలిగాడు.రాజు చేసిన అలజడి తెలిసి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యాధికారులు అప్రమత్తమై పరీక్షల్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా జాగ్రపడి పరీక్షలను సాఫీగా జరిపించారు.


        పరీక్షలు ముగిసిన తరువాత రాజు తండ్రి గోపీ తండ్రిని కలిసి, "నా కుమారుడు చేసిన నేరం నాకు ఆలస్యంగా తెలిసింది. మీరు ఒక ఉపాధ్యాయు కాబట్టి పిల్లల భవిష్యత్ దృష్టిలో పోలీసులకు ఫిర్యాదు చెయ్యలేదని నాకు తెలుసు,నాకొడుకు చేసిన తప్పుకి నన్ను క్షమించండి"అని చేతులు పట్టుకొని క్షమాపణ కోరాడు."నేను పోలీసులకు ఫిర్యాదు ఇద్దమనుకున్నాను కానీ మీకు ఈ ప్రాంతంలో మంచి పేరు ఉంది, కొద్దీ రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి, మీ అబ్బాయి రౌడీ వేషాలు వేస్తున్నాడని ప్రజలు మీకు ఓటువెయ్యరు,అంతేకాకుండా నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీ అబ్బాయిని, అతని మిత్రులను పోలీసులు అరెస్ట్ చేస్తారు, వాళ్ళ జీవితాలు పాడైపోతాయి,అందుకే నన్ను మా అబ్బాయి గోపి వారించి పోలీసులు వద్దకు వెళ్లవద్దని కోరాడు"అని గోపి తండ్రి చెప్పాడు, తండ్రి పక్కనే ఉన్న రాజు గోపి గొప్ప మనసు గురుంచి విని అతని పట్ల తాను చేసిన పనికి సిగ్గుపడి, అప్పటి నుండి క్రమశిక్షణతో జీవితాన్ని గడపడం అలవాటు చేసుకున్నాడు.



Rate this content
Log in