M.V. SWAMY

Children Stories

5.0  

M.V. SWAMY

Children Stories

మేకా మేకా విన్నావా

మేకా మేకా విన్నావా

3 mins
1.2K


మేకా...మేకా... విన్నావా! (కథ)


ఒక అడవిలో ఒకే ఒక మేక ఉండేది. చాలా పెద్ద అడవిలో వేలాదిగా ఉన్న వందల జాతుల జంతువులు మద్య మేకల జాతినుండి ఒకే ఒక మేక ఉండటంతో ఆ మేకను ఎంతో అభిమానంగా చూసుకొనేవి తోటి జంతువులు. మేక సంగతి ఆ అడవికి రాజు పులికి తెలిసింది." అడవిలో అంతరించిపోతున్న జంతు జాతుల్లో మేకల జాతి ఒక్కటి, అయితే అంతరించిపోతున్న జాతుల్లో అరుదైన జాతి మేకను మనం కంటికి రెప్పలా కాపాడుకోవాలి,ఆ ఒక వేళ నా మాటను పట్టించుకోకుండా ఏ మృగమైనా మేక జోలికి వెళ్తే ఆ మృగానికి మరణ శిక్ష తప్పదు" అని పులి ఆదేశాలు ఇచ్చింది. చూడ ముచ్చటగా ఉన్న మేకను చంపి,పులి పంజా దెబ్బలు తిని చనిపోయి అప్రతిష్ట పొందడం ఎందుకని మేకకు హాని తలపెట్టకుండా మేకను జాగ్రత్తగా కాపాడుకుండేవి ఆ అడవి జంతువులు. ఆ అడవిలో కళ్ళు కనిపించని ఒక నక్క ఉండేది,పైగా దానికి చెవుడు ఉండేది, జాలితో ఆ నక్కిని కూడా జాగ్రత్తగా కాపాడుతుండేవి ఆ అడవి జంతువులు.


    సాక్షాత్తూ అడవిరాజే తనకు రక్షణగా ఉండగా అడవిలో తన హవాకి తిరుగులేదని మేక చాలా గర్వంగా ఉండేది, గర్వం కాస్తా పొగరుగా మారింది, పొగరు మూర్ఖంగా మారి మేక చిన్నా చితకా సాధు జంతువుల పాలిట శాపంగా మారింది. పక్షుల గూళ్ళును పాడు చేస్తుండేది. కుందేళ్లు కుటుంబాలను హింసించేది. అంతేకాదు ఏ జంతువైనా కాస్తా బలహీనంగా కనిపిస్తే దానిపై దాడిచేసి గాయపర్చేది. ముఖ్యంగా కంటి చూపు లేని నక్కను నిత్యం హేళన చేస్తూ దానికి తీవ్ర మానసిక క్షోభకు గురిచేసేది.


      ఒక రోజు ఆ నక్క అడవిలో పెద్దదిక్కు అనిపించుకుంటున్న ఎలుగుబంటి వద్దకు వెళ్లి మేక చేస్తున్న ఆగడాలను ఏకరువు పెట్టింది. కంటి చూపులేని నక్కనే కాకుండా...చిన్న చిన్న జంతువులను పక్షులను మేక వేధిస్తున్న సంగతి తెలుసుకున్న ఎలుగుబంటి మేకకు బుద్ధి చెప్పడానికి ఎలుగుబంటి, అడవి రాజు పులి వద్దకు పోయి మేకతీరును వివరించింది. తనముందు అతివినయ విధేయతలు చూపే మేక అలా చేస్తుందంటే పులి ఏ మాత్రమూ నమ్మలేదు పైగా "వయసుపైబడిన మీ చాదస్తం గానీ కుంటిదైన, కంటి చూపులేనిదైనా నక్కను నమ్మరాదు, నక్కలు చుట్టాలుచే పాముని కొట్టించేరకాలు, మన చేత మేకను చంపించాలని నక్కలు అన్నీ కలిసి చేస్తున్న కుట్ర ఇది" అని ఎలుగుబంటి ఫిర్యాదును తేలిగ్గా తీసుకుంది పులి."తమరు స్వయంగా మేక చేసిన అల్లరి చూస్తే మీకే తెలుస్తుంది" అని ఎలుగుబంటి అనడంతో...పులి ఆలోచనలో పడింది.


  ఎలుగుబంటి ఒక రోజు అడవిలోని జంతువుల, పక్షుల అత్యవసర సమావేశం పెట్టింది. ఆ సమావేశానికి మేక కూడా వచ్చింది. "మన అడవికి రాజైన మన పులికి ఒక మొసలితో జరిగిన పోరాటంలో కళ్ళు పోయాయి, చెవుడు వచ్చేసింది, గొంతుపోయింది, ఒక కాలు విరిగిపోయింది, పులి మనలో ఒక జంతువైన కంటి చూపులేని నక్కను మొసలి దాడినుండి కాపాడడానికే మోసలితో పోరాడి నక్కను కాపాడి తాను గాయలు పాలైంది, ఇకపై పులిని, నక్కను, మేకను మనమే కాపాడుకోవాలి" అని మర్మ గర్భంగా మాట్లాడింది. నిజంగానే తాను కుంటిది గుడ్డిది అయిపోయినట్లు పులి నటించింది.


మేక బోర విరిచి పొగరుగా నిలబడి " ఓ ముసలి ఎలుగుబంటీ మీరేంది నన్ను కాపాడేది ఈ అడవిలో పులి తప్ప నాతో ముష్టి యుద్ధంలో తలపడే జంతువే లేదు ఇక ఆ ఫులే కుంటిది, గుడ్డిది, చెవుటుది,మూగది అయిపోయింది, ఎర్రిబాగుల పులి కాబట్టి మొసలితో పోరాడి గుడ్డి నక్కను కాపాడి తాను గుడ్డిది అయ్యింది, ఇక నేను ఆడుకోడానికి హేళన చెయ్యడానికి గుడ్డి నక్కతో పాటు ఏ అవయవాలు పనిచెయ్యని పులి కూడా దొరికిందన్న మాట ఇక చూసుకో... నా సామిరంగా" అంటూ వెటకారంగా నవ్వుతూ వెళ్లి పులి తోక తొక్కింది.


మేక నమ్మకద్రోహానికి పులి రక్తం ఉడికిపోయింది. మెరుపు వేగంతో మేకపై బలంగా పంజా దెబ్బవేసి మేక గొంతుకు ముడిని తన నోటితో పట్టేసింది, అయితే వెంటనే ఎలుగుబంటి పులిని శాంతపరిచి" మిత్రమా! చంపడం చావడం వల్ల లోకానికి మంచి సందేశం వెళ్లదు, మేకను చంపవద్దు, తీవ్రంగా మందలించి వదిలేయండి" అని హితవు పలికింది, పెద్దలు మాటలు గౌరవించే పులి,మేకను వదిలేసి "నేను గతంలో ఇచ్చిన ఆదేశాలను మార్చుతున్నాను ఇకపై ఈ మేక వల్ల ఏ జీవికైనా ఇబ్బంది కలిగిందని తెలిస్తే ఎవ్వరూ చెప్పినా వినను మేక ప్రాణాలు తీసేస్తాను" అని ఆవేశంగా ప్రతిజ్ఞ చేసింది. పులి పంజా దెబ్బకు మేక మక్క జారిపోయింది, గొంతులో పులికోరలు దిగి తీవ్రంగా రక్త శ్రావం అయ్యింది, ఎలుగుబంటి సూచనతో కేందేళ్లు మేకకు ఆకు పసర వైద్యం చెయ్యగా పక్షులు ఆకులతో పులి గాయాలకు కట్లు వేసాయి,చూపులేని నక్క "మేకకు హాని చెయ్యవద్దు నిజంగా అడవిలో అరుదైన జంతువు నా కారణంగా ఆ జాతి అంతం కావడం నాకు ఇష్టం లేదు" అని ఆ సమావేశాన్ని కోరింది. తృటిలో తప్పిన చావు నుండి బయటపడిన మేక తేరుకొని తన తప్పును క్షమించమని పులి,నక్క కుందేళ్లు,ఎలుగుబంటితో పాటు అన్ని జీవులకూ కోరాలనుకుంది అయితే దాని గొంతు పనిచెయ్యలేదు, పైగా జెబ్బ జారి అది కుంటిది అయిపోయింది." ఇకనైనా బుద్దిగా ఉండు, స్వేచ్ఛను సరిగ్గా వినియోగించుకోక పోతే ఇలాగే ఉంటుంది" అని మేకకు చీవాట్లు పెట్టి ఆ సమావేశాన్ని ముగించాయి అడవి జీవులు.


     


Rate this content
Log in