ఆడుతు పాడుతు పని చేస్తుంటే
ఆడుతు పాడుతు పని చేస్తుంటే


జీవన శైలి - సినిమాలు అనే ఆర్టికల్ రేపు మ్యాగజైన్ కి పంపాలి. హాలీవుడ్ సినిమాలన్నీ తిప్పి తిప్పి కొడుతూ ఉంటే హాల్లోంచి ఏదో పాత పాట వినిపిస్తోంది.
అమ్మా నాన్నా ఇద్దరూ కూర్చొని తోడి కోడళ్ళు సినిమా చూస్తున్నారు.
నేనూ వెళ్ళి వాళ్ళ పక్కనే కూర్చునేసరికి నా కొడుకు కళ్యాణ్ వచ్చి నా ఒళ్ళో కూర్చుని సినిమా గురించి ప్రశ్నలు అడుగుతున్నాడు.
వయసు ఆరేళ్లు కూడా లేదు కానీ వీడు అన్నీ యక్ష ప్రశ్నలు వేస్తాడు.
అక్కినేని సావిత్రి ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అనే పాటలో నీళ్ళు పొలంలోకి వచ్చేట్టు క్రింద నుండి పైకి పోస్తూ ఉన్నారు.
నాన్నా అదేంటి అని మా అబ్బాయి అడిగాడు.
నాకు తెలిస్తే కదా వాడికి చెప్పడానికి.
మా నాన్న కళ్యాణ్ ని దగ్గరకు తీసుకుని దాని పేరు గూడ అని చెప్పాడు. వెదురుతో చేసిన గూడతో నీళ్ళు పొలం పక్కన క్రింది భాగంలో ఉన్నప్పుడు వాటిని పై భాగంలోకి చేర్చడానికి వాడుతారు నాన్నా అని మనవడికి చెబుతున్నారు.
నీరు పల్లంలోకి సులభంగా వెళుతుంది కానీ ఎత్తులో కి సులభంగా వెళ్ళదుగా అందుకే ఇలా చేసేవారు. తరువాత కాలంలో లోహంతో తయారు చేసుకునేవారు అంటూ మా అమ్మ కూడా చెప్పింది.
మా అబ్బాయికి ఎంత వరకు అర్థం అయ్యిందో తెలీదు కానీ నాకు మాత్రం మరుసటి రోజు ఆర్టికల్ కోసం బోలెడంత మెటీరియల్ దొరికింది.
పాత తెలుగు సినిమాల్లో సాధారణ మనుష్యుల జీవన శైలిని కథలో ఎంత బాగా ప్రతిబింబించే వారో. నేనేమో ఇంగ్లీషు సినిమాలు వెతుకుతూ కూర్చున్నాను.
మన దగ్గర లేనట్టు.