వింత తీర్పు
వింత తీర్పు

1 min

705
అనగనగ ఒక పక్షి ఒక చెట్టు పై నివాసం ఉండేది. అది పెట్టిన గుడ్లను ఒక పాము తింటూ ఉండేది.
ఆ విషయం తెలుసుకున్న నక్క, పక్షికి న్యాయం చేయాలని ముక్త కంఠంతో వాదించింది.
విషయం సింహం వరకు చేరింది. పక్షికి రక్ష్యణ కల్పించటం కోసం సింహం ఆ పామును చంపింది.
నక్క పాము బంధువుల పక్ష్యం చేరింది. పాము బంధువులకు న్యాయం చేయాలని ముక్త కంఠంతో వాదించింది.
ఈసారి అందరూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అక్కడ సింహం చేసిన పని తప్పని తీర్మానించారు.
సమస్యకు శాశ్వత పరిష్కారంగా తుది తీర్పు ఇవ్వడం జరిగింది.
ఆ తీర్పు ఏంటంటే:
ఇక నుండి ఆ పక్షి గుడ్లు పెట్టరాదు అని తీర్మానించడమయినది.
ఈ కథ నేటి సమాజం తీరును ప్రతిబింబిస్తుంది