పర్యావరణ పరిరక్షణDINAKAR REDDY
పర్యావరణ పరిరక్షణDINAKAR REDDY
అదేంటమ్మా! నేను పర్యావరణ దినోత్సవం గురించి వ్యాసం వ్రాసి ఇవ్వమంటే నన్ను పెరట్లోకి తీసుకొచ్చావు.
ఆరో తరగతి చదువుతున్న హర్ష వాళ్ళ అమ్మమ్మ ను అడుగుతున్నాడు చిరాగ్గా.
అది రేపు వారంలో కదా సబ్మిట్ చేయాల్సింది అని ఆమె నవ్వుకుంది.
అనసూయమ్మ ఓపిగ్గా హర్షతో ఓ మొక్కను నాటించింది.
హర్షకు ఏమీ అర్థం కాలేదు.
నాలుగు రోజులు హర్ష ఆ మొక్కకు నీళ్ళు పోస్తూ గమనించసాగాడు.
ఐదో రోజు ఆ మొక్కకు కొత్త ఆకులు రావడం గమనించాడు హర్ష. అతడి ముఖంలో ఏదో తెలియని ఆనందం కనిపించింది అనసూయమ్మకు.
ఏమైంది హర్షా! మొక్కలో ఏం గమనించావు అని అడిగింది.
హర్ష కొత్తగా వస్తున్న ఆకులు చూపిస్తూ నేను దీనికి రోజూ నీళ్ళు పోస్తాను అని నవ్వుతూ అన్నాడు.
అనసూయమ్మ హర్షను దగ్గరకు తీసుకుని ఎందుకో రోజూ నీళ్ళు పోయడం అని అడిగింది.
హర్ష అనసూయమ్మ చేయి పట్టుకుని అమ్మమ్మా! ఈ మొక్క పెద్ద చెట్టు అవుతుంది కదా అని అడిగాడు.
అనసూయమ్మ హర్ష తల నిమురుతూ చ
ెట్టు కింద నువ్వు ఆడుకోవచ్చు అంటూ మనవడిని లోపలికి తీసుకు వెళ్ళింది.
ఇప్పుడు నాకు పర్యావరణ పరిరక్షణ గురించి వ్యాసం వ్రాసి ఇస్తావా అమ్మమ్మా అని అడిగాడు హర్ష.
ఇదిగో ఎప్పుడో వ్రాశాను తీసుకో అని కాగితం అతని చేతిలో పెట్టింది. హర్షా! పర్యావరణ పరిరక్షణ అంటే కేవలం వ్యాసం వ్రాయడమో, మొక్కలు నాటి వాటితో ఫోటోలు దిగి మరచిపోవడమో కాదు.
రాబోయే తరాలు స్వచ్ఛమైన గాలి,నీరు ఇంకా వాతావరణం పొందగలిగేలా చేయడం.
అందుకే నేను నీతో మొక్క నాటించాను. అలా నువ్వు మొక్క నాటిన ప్రతి సారీ దానిని పెంచే బాధ్యతను కూడా తీసుకోవాలి.
హర్ష సరేనంటూ ఆ కాగితం తీసుకుని చదువుకున్నాడు.
ఆ వ్యాసం సాలుమరద తిమ్మక్క అనే పర్యావణవేత్త గురించి. కర్ణాటకకు చెందిన ఈమె హులికుల్ నుండి కుడుర్ వరకు ఉన్న జాతీయ రహదారి పక్కన నాలుగు కిలోమీటర్ల మేర 384 మర్రి చెట్లు పెంచడం ద్వారా జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందారు.
పర్యావరణానికి చేసిన కృషికి గుర్తింపుగా ప్రభుత్వం భారత జాతీయ పౌర పురస్కారంతో గౌరవించింది.