Sasikala Thanneeru

Inspirational Others Children


5  

Sasikala Thanneeru

Inspirational Others Children


మా నాన్న ఇచ్చిన ధైర్యం

మా నాన్న ఇచ్చిన ధైర్యం

3 mins 5 3 mins 5


అమ్మ తొమ్మిది నెలలు కడుపులో మోస్తే

చనిపోయేవరకు గుండెల్లో మోసేవాడు నాన్న.


నాన్న వేలు ప్రపంచానికి వేసిన దారి 


వెనుక నిలబడిన నాన్న ముందు వేసే అడుగులో ని ధైర్యం. 


నాన్న ,నాన్నలాగా గుంభనగా అవసరాలు చూస్తూ ఆసరాగా నిలబడి ఆర్ధికంగా చేయూత నిస్తేనే గొప్ప అయితే ఇవి కాకుండా మా వ్యక్తిత్వానిర్మాణానికి కూడా స్ఫూర్తి నిచ్చిన మా నాన్న గొప్ప నాన్న.అందరికంటేనా అంటే ఏమో నాకు తెలిసిన నాన్నలలో కల్లా గొప్ప!!


ఆడపిల్ల అనగానే మొహం మాడ్చుకునే 1970 

కాలం,అందులో రెండో ఆడపిల్లని ఇప్పటి మాటల్లో చెప్పాలంటే ఆన్ వాంటెడ్ చైల్డ్ !! పుట్టిన నన్ను చూసి కొన్ని రోజులు బాధపడినా ఇక ఎప్పటికీ బాధపడకుండా మమ్మల్ని చూసి అందరూ గర్వపడే విధంగా పెంచారు మా నాన్నగారు 

తన్నీరు వెంకటేశ్వర్లు శ్రేష్టి గారు.


నాన్న జ్ఞాపకం అంటే నాన్న వేలు పట్టుకొని విశాలాంధ్ర బుక్ హౌజ్ వాన్ లో ఎర్రఈకల కోడిపుంజు బొమ్మ కొనిచ్చిందే జ్ఞాపకం!

ఎన్ని పుస్తకాలు కొనిచ్ఛేవారో!!ఎప్పుడూ పుస్తకం చదువుతూ నిద్రపోవడం పిల్లలకీ ఆయన చేసిన మంచి అలవాటు.ఆయన మంచం క్రింద పుస్తకాలు,అరటి పండ్లు,నీళ్లు ఉంచుకునేవారు.

నలుగురు పిల్లల్లో రాత్రి ఎవరికి ఆకలి అవుతుందో అని ,అంత జాగ్రత్తగా ప్రేమగా చూసుకునేవారు.


నాన్నకు తగినదే అమ్మ.జీవితం లో ప్రతి విషయం ఆనందించేలా వివరించి చెప్పేవాళ్ళు.పక్క వారిని సంతోషంగా ఉంచేలా నేర్పేవారు.బిచ్చగాడికి గుప్పెడు బియ్యం మా చేత వేయించేవాళ్ళు.

చదువు కంటే ముఖ్యమైన సంస్కారాన్ని నేర్పేవాళ్ళు.


అమ్మాయి గోంగూర పచ్చడిలో ఉల్లిపాయ నంజుకో,బాబు పెరుగులో మీగడ విడిగా తిను,కూర కారంగా ఉందేమో ఈ నెయ్యి తినండి ,అప్పుడు అరచేతిలో తెల్లగా మెరిసే నెయ్యి నాన్న హృదయం అంత కమ్మగా ఉండేది.కంది పచ్చడిలోకి నిమ్మకాయ ఊరగాయ చేర్పు,వంకాయ ఒరుగులు పులుసు ఎలా తినాలో,సాంబారులో అప్పడాలు,తోటకూర కి చల్ల మిరపకాయలు......ఒక్కొక్క రుచి ఆయన ప్రేమతో మరింత మధురం అయ్యేది.తినే ప్రతిదీ మేము ఆస్వాదిస్తూ తింటే ఆయన కడుపుతో పాటు మనసు నిండేది!!!పెళ్లి అయ్యి మళ్లీ మా పిల్లలకు పెళ్లి అయిన తరువాత కూడా ఇంటికి వెళ్ళగానే మాకు అన్నం పెట్టిస్తే ఆయన కళ్ళలో కనిపించే తృప్తి కోసం ఖాళీ కడుపుతో వెళ్ళేవాళ్ళం. అన్నం తో పాటు ఆప్యాయత మా హృదయం లో నింపుకొని తిరిగి అత్తవారింటికి వచ్చే వాళ్ళం.


"అదిగో ఆ సార్ నన్ను కొట్టింది,అడుగు"

అని నేను అనగానే ఆ అయ్యవారిని పిలిచి

"ఫర్లేదు పాపని బాగా చదివించండి.మాట వినకపోతే ఇంకొంచెం కొట్టండి"అనే నాన్న మాటలకి నేను భయపడిపోతే,అంత టి షావుకారు,రాజకీయ నాయకుడు తనలోని విద్య ను గౌరవించినందుకు ఆ అయ్యవారి కళ్ళు గర్వం గా మెరిసేవి. ఇక నాకు చదవడం తప్ప వేరే దారి లేదు.సంపద విద్యను కొనలేదు.వినయంగా విద్యను సాధించుకోవడమే!

"తల దించుకొనే పనులు చేయవద్దు.

చేయని తప్పుకు తల దించవద్దు"ఇదే నాన్న నేర్పినది. విద్యను గౌరవించే దగ్గరకు ఆ చదువుల తల్లి ఇష్టం గా వస్తుంది.మీ ఆడపిల్లలు ఇద్దరు సరస్వతీ దేవులు అంటే నాన్న పొంగిపోయేవారు.

ముగ్గురు ఆడపిల్లలను,కొడుకు ను బాగా చదివించాలి అనుకునేవారు.చేసి చూపించారు.


కాలేజీ చదువు అందులో ఎం.పి.సి,అదీ బయట ఊరు అయిన విద్యానగర్లో ఇది ఆడపిల్లలకు చేతికి రాని కల.కానీ నాకు అందించాడు నాన్న.

అక్కని తిరుపతి వ్యవసాయ కళాశాల లో చేర్పించారు.ఆడపిల్లలను చదివించి ముందుకు ఆయన వేసిన అడుగు వెనుక ఎందరో ఆడపిల్లలకు దారి చూపింది.


ఆ రోజు నాకు బాగా గుర్తు.మేడసాని మోహన్ గారి అవధానం కాలేజ్ లో జరిపించాము.నేను తెలుగు ఆఫీస్ బేరర్ గా ఉన్నాను.అదీ కాక అదేమిటో చూద్దాము అని కుతూహలం.చాలా బాగా జరిగింది.బస్ ఎక్కి ఊరికి వెళ్లే సరికి సాయంత్రం ఆరు అవుతుంది.బస్ దిగగానే ఒక పాలేరు ఎదురు వస్తున్నాడు"బుజ్జమ్మ ఏమి ఆలస్యం,నాయన కంగారుపడుతూ నన్ను పంపాడు" అడుగుల్లో వేగం పెంచాను.

అయినా ఇంటికి వెళ్ళేసరికి అడుగు కు ఒకరు ఎదురు అవుతున్నారు నా క్షేమ సమాచారం అడుగుతూ.ఇంట్లో కి వెళ్ళగానే నన్ను చూసి 

ఆయనకు రిలీఫ్.మమ్మల్ని ఎంత తప్పు చేసినా ఏమీ అనరు,అమ్మను తిట్టేస్తారు.దానికే మేము భయపడి పోతాము.నాన్న నిన్ను ఇంక ఎప్పుడూ కంగారు పెట్టను, మనసులోనే ఆయన ప్రేమకు లోబడి ఒట్టేసుకున్నాను.


మాకు ఫస్ట్ క్లాస్ లు వచ్చినప్పుడల్లా ఆయన సంతోషము, పెళ్లి అయ్యి మావారితో వెళుతూ ఉన్నప్పుడు ఆయనలో ఉబికిన దుఃఖం అంతే,

మమతానురాగాలు ఎప్పుడూ కన్నీళ్లనే తెస్తాయి ఇప్పుడు తలుచుకున్నా!!!


నాన్నా నాకు కష్టం అన్నా,నాకు కష్టం వస్తుందేమో అని ఆయనకు అనిపించినా నా పక్కనే వచ్చేసి ఉంటారు.

"శశమ్మ, వెళ్లి పరీక్ష వ్రాయి.మెరిట్ మీదే ఉద్యోగం ఇస్తారట.మంచి అవకాశం" నాన్న మాటలు వింటూ అత్తగారింట్లోని అందరూ ఆలోచిస్తున్నారు.

మా ఇద్దరికీ ఉద్యోగాలు లేవు.వ్రాయాలి తప్పదు,

కానీ........ అందరూ ఆలోచిస్తూ ఉన్నారు.

నాకు నెలలు నిండుతూ ఉన్నాయి.ఎప్పుడు కానుపో చెప్పలేము.పరీక్ష హైదరాబాదులో,రాష్ట్ర స్థాయి పరీక్ష,అదీ పేపర్ ఇచ్చేది ఎస్.సి.ఆర్.టి వాళ్ళు.బాగా ప్రిపేర్ కావాలి.ముందు నెలలు నిండిన కోడల్ని పంపడానికి అత్తగారిని నచ్చ చెప్పాలి.

నాన్న,అమ్మ ముందుకు వచ్చారు.మేము ఇద్దరం హైదరాబాద్ కు దగ్గర ఉండి తీసుకెళ్ళి పరీక్ష వ్రాయించి తీసుకువస్తాము.అందరినీ ఒప్పించి తీసుకొని వెళ్లి వ్రాయించారు.ఈ రోజుకు నా చేతికి వచ్చే రూపాయల్లో మా నాన్న సంకల్పం,దీవెన కనిపిస్తూ ఉంటాయి.

అబ్బాయి చదువు,నేను ఉన్నాను కానీ!అమ్మాయి పెళ్ళి, నేను ఉన్నాను కానీ!ట్రాన్స్ఫర్,నేను ఉన్నాను వెళ్ళు. ప్రతి అడుగు పక్కన మాతో నువ్వు ఉన్నావు కదా నాన్నా!ఇప్పుడు నాకు మనవడు పుడితే మాత్రం నీ అవసరం లేదు ఇక అని అలా ఎలా పైకి వెళ్లిపోయావు?దుఃఖం వస్తే తల వాల్చుకొనే భుజం ఏది?కొండనైనా ఢీ కొట్టడానికి నువ్వు నాకిచ్చిన ధైర్యం ఏది?శశమ్మ అని ప్రేమగా పిలిచే పిలుపు ఏది?ఇంకొంతకాలం ఉండకూడదా నాన్న,నేను నీతో పైకి వచ్చేసేదాన్ని!!!😢😢

           @@@@@Rate this content
Log in

More telugu story from Sasikala Thanneeru

Similar telugu story from Inspirational