ఏమి తెలుసుకున్నాము కొరొనాతో?
ఏమి తెలుసుకున్నాము కొరొనాతో?


#సూటిగామాట్లాడండి
ఏమి జరుగుతుంది ఈ కొరొనాలో?అదిగో చైనా లో ఉంది కొరొనా,లక్షల మందికి పాకి ఊపిరి ఆడనీకుండా చంపేస్తుంది అన్నారు.అదిగో పులి అనేసరికి ఇదిగో తోక అని నెల్లూరికి మొదటి కేస్ ఇటలీ నుండి వచ్చేసింది.హమ్మయ్య దానిని క్యూర్ చేసాము అనుకునేసరికి డిల్లీ లో ఒక మత మీటింగ్ నుండి పాల్గొన్నవాళ్ళ భుజాలు ఎక్కి చాలా గ్రామాలకు వచ్చేసింది.అటు ఇటు చూసేసరికి పండుగకు చెన్నై లో షాపింగ్ చేసేవాళ్ళ ద్వారా ఇంకో వైపు చెక్ పెట్టింది కొరొనా.అది వచ్చిన తరువాత ఊపిరి ఆడకపోవడం ఏమిటో కానీ వస్తుంది అని వార్త ఊపిరి ఆడనీకుండా గజ గజ లాడించింది.
ప్రభుత్వం కర్ఫ్యూ అంది.లాక్. డౌన్ అంది.అన్ని రంగాలు మూతలు పడ్డాయి.పిల్లలు పరీక్షలు లేకుండానే పాస్ అయిపోయారు.బ్రతికుంటే చాలని లక్షల మంది వేల కిలోమీటర్లు ఆకలితో,చెప్పులు లేని పాదాలతో, భుజాల పైన కుటుంబాన్ని మోస్తూ స్వగ్రామాలకు చేరుకున్నారు.ఆడవాళ్లకు ఇంట్లో పనిభారం పెరిగింది.కొరొనా ఏమి నేర్పించిందో తెలీదు కానీ రెండకెలలో కేస్ లు ఉన్నప్పుడు భయపడిన మనం లక్షల్లో కేస్ లు వచ్చినా ఇప్పుడు భయపడటం లేదు.మనిషి ఎంత కృత్రిమంగా జీవిస్తున్నాడో బాగా అర్థం అయింది.మన ఇల్లు,ఇంట్లోవాళ్లే మనకు మిగిలేది అని తెలిసింది.