ఇంకో కోణం
ఇంకో కోణం


#sasiworld 4
ఇంకో కోణం
....వాయుగుండ్ల శశికళ
బాబు హై స్కూల్ లో ఉన్నప్పుడు సంగతి.సాయంత్రం నా టీ,ఒక బుక్ తీసుకొని డాబా మీదకు వెళ్లి చదువుకుంటూ ఉండే అలవాటు నాకు.ఉదయం నుండి పని,బడి అన్నింటి నుండి దూరంగా హాయిగా ఆకాశం క్రింద ఉన్నట్లు ఉంటుంది నాకు.నివాస్ కూడా అక్కడే చదువుంటూ తిరుగుతూ ఉండేవాడు కొన్నిసార్లు అక్కడ.ఒక రోజు కొంచెం చీకటి పడుతుంది."అమ్మా చూడు చందమామ వేప చెట్టు మీద"అన్నాడు.అప్పటికి వెన్నెల వచ్చేంత చీకటి లేదు.ఇప్పుడు చందమామ ఏమిటి?చెట్టు మొత్తం వెతికాను."ఎక్కడ రా.లేదు పో"అనేసాను.ఆట పట్టిస్తున్నాడేమో అనుకున్నాను. ఉంటే కనపడాలి కదా."ఇక్కడికి రామ్మా" లాక్కెళ్లి వాడి స్థలం లో నిలుచోపెట్టి చూపించాడు.నిజంగానే పెద్ద చందమామ.ఎంత బాగున్నాడో!ఇ
ందాక లేడు అనుకుంటినే.ఆ వేప కొమ్మ అడ్డం ఉండేసరికి నాకు కనపడలేదు అక్కడ నుండి.
అప్పుడు మనసులో చిన్నగా అనిపించింది.ఏ విషయం అయినా మన కోణం లో ఒక రకంగా ఉంటే ఇంకొకరి దృష్టి కోణం లో ఇంకొక రకంగా ఉండవచ్చు.చెప్పే విషయం లో ఇంకా వేరే కోణాలు ఉన్నాయి అనుకోవడం ,తెలుసుకోవడం మన జ్ఞానాన్ని ఇంకా పెంచుతుంది కదా.అనంతమైన ఆకాశాన్ని చూస్తూ ఉంటే మనకు తెలిసింది ఎంత అనిపిస్తూ ఉంటుంది.ఇదిగో ఇలాంటి చిన్న సంఘటనలే ఏవో ఒక పాఠాలు నేర్పుతూ ఉంటాయి.ఇక నుండి ఎవరికి ఏమి చెప్పినా, నేను అనుకునేది ఏమంటే అని వినయంగా చెప్పాలి.అప్పుడు వాళ్ళు అనుకునేది ఏమిటో చెపుతారు.మన భావాన్ని బట్టే కదా ఎదుటి వారి ప్రతిస్పందన.
"అంతేనా?"చంద్రుడిని చూసి నవ్వాను.అవునవును అని పెద్దగా నవ్వాడు పై నుండి!
@@@@@