STORYMIRROR

manchikanti 04

Children Stories

4  

manchikanti 04

Children Stories

చెత్తబుట్టలు జిందాబాద్

చెత్తబుట్టలు జిందాబాద్

5 mins
610


 చెత్తబుట్టలు జిందాబాద్.

 స్కూల్లోని చెత్త బుట్టలన్నీ అనుకున్న ప్రకారమే ఆరోజు పాఠశాలలో సమావేశమయ్యాయి .వాటి సమస్యల గురించి చర్చించుకో సాగాయి .అది చూసి పిల్లలందరూ గోల చేస్తూ క్లాసుల నుండి బయటకు రాసాగారు. టీచర్లు కర్రలు పట్టుకుని బాదుకుంటూ పిల్లల్ని లోపలకు పంపిస్తున్నారు .

హెడ్ మాస్టర్ చెత్త బుట్టల దగ్గరగా వెళ్లి వినయంగా వంగి నమస్కరిస్తూ "అమ్మా మా పరువు తీయవా కండమ్మా. రండమ్మా మీరు చెప్పినట్టే పిల్లల చేత పని చేయిస్తాము "అంటూ బతిమలాడసాగాడు

" ఎన్నిసార్లు చెప్పాము మేము .ముందు మర్యాదగా పిల్లలకు చెప్పాము.పిల్లలు వినలేదు .టీచర్లకు చెప్పాము .వాళ్ళు వినలేదు. ఆ తరువాత మీకు ఎన్నిసార్లు చెప్పాము.మీరూ వినలేదు .

ఆ ఏందిలే చెత్త బుట్టల మాటలు ఏంది! మనం వినేది ఏంది అని మీరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు .ఇవాళ అటో ఇటో తేలిపోవాలి పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం సర్పంచ్ గారి ఇంటికి" అంటూ చెత్తబుట్టల్ని ఉసిగొల్పింది నాయకురాలు చెత్తబుట్ట .

స్కూల్ నుండి మొదటి చెత్తబుట్ట బయటకు ఎగిరి దూకింది .

దాని వెంట మరో చెత్తబుట్ట "పిల్లల నిరంకుశత్వం నశించాలి" అంటూ ఎగిరి దొరికింది .

దాని వెంట మరోటి దాని వెంట మరోటి బయటికి దూకాయి .అలా స్కూల్లో ఉన్న చెత్త బుట్టలన్నీ బయటకు దూసుకుపో సాగాయి ."ఉపాధ్యాయుల ఉదాసీనత నశించాలి .పిల్లలు పెట్టే హింస నశించాలి. అపరిశుభ్ర క్లాస్ రూములు మాకొద్దు మాకొద్దు .పని విధానం మారాలి .....మారాలి "అంటూ గ్రామంలోని వీధుల వెంట నినాదాలు చేస్తూ ఊరేగింపుగా బయలుదేరాయి .

పంచాయతీ ఆఫీస్ దగ్గర కు రాగానే అక్కడ ఆగి పంచాయితీ చెత్త బుట్టలతో తమ సమస్యలను విన్నవించుకుంది నాయకురాలు చెత్తబుట్ట .

దాంతో పంచాయతీ చెత్తబుట్టలు కూడా ఊరేగింపులో కలిశాయి .

దారిలో పోతూ పోతూ ఇళ్లల్లోని చెత్తబుట్టలకు కూడా తమ సమస్యలను చెప్పాయి .

దాంతో అవి కూడా ఊరేగింపుతోపాటు రాసాగాయి. చెత్తబుట్టలు అన్నీ వీధుల వెంట నినాదాలు చేసుకుంటూ పరుగులు తీయ సాగాయి .

నాయకురాలు చెత్తబుట్ట "ఆగండి ఆగండి "అంటూ గట్టిగా కేకలు వేసింది .అన్ని చెత్తబుట్టలు ఆగిపోయాయి 

"ఏంది మనం ఏమన్నా స్కూల్ పిల్లలమా క్రమశిక్షణ లేకుండా ఎటు పడితే అటు పరుగులు తీయడానికి. స్కూల్లో ఉండి ఉండి పిల్లల అలవాట్లు వచ్చాయి మీకు కూడా .అది పద్ధతి కాదు .కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించండి .అదీగాక మనం ఇప్పుడు సమ్మె బాటలో ఉన్నాం .సమ్మె నియమాలు పాటించండి "అంటూ నాయకురాలు చెత్త బుట్ట కోపంగా చెప్పింది. చెత్తబుట్టలు క్రమశిక్షణతో సర్దుకుని లైనులో నిలబడ్డాయి .

 గ్రామంలోని వీధులలో నినాదాలు చేసుకుంటూ గ్రామ సర్పంచ్ ఇంటి వైపుకు దారితీశాయి .

 అమ్మలక్కలు అందరూ ఇళ్లల్లో నుండి బయటకు వచ్చి చూస్తున్నారు" చూశావంటే ఈ చోద్యం చెత్త బుట్టలన్నీ సమ్మె చేస్తున్నాయంట బళ్లో వాటినన్నిటిని, ఎవరూ లెక్క చేయడం లేదంట" బుగ్గలు నొక్కుకుంటూ చెప్పింది ఒక ఆమె .ఇప్పుడు సర్పంచ్ గారి బజారుకు వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఇంకాస్త పెద్దగా అరవండి" అంటూ హెచ్చరించింది నాయకురాలు చెత్తబుట్ట. డౌన్ డౌన్ స్కూల్ పిల్లలు డౌన్ డౌన్ ......చెత్త బుట్టల్ని చెత్త బుట్టల్లా చూడాలి. మనుషుల్లా చూడకూడదు. మా ఆత్మగౌరవాన్ని అని నాయకురాలు అంటే కాపాడుకుందాం కాపాడుకుందాం మిగిలిన చెత్తబుట్టలన్నీ అరవ సాగాయి .చెత్తబుట్టలు ఊరేగింపు సర్పంచ్ ఇంటిముందు ఆగింది నాయకురాలు చెత్తబుట్ట సర్పంచ్ గారి ఇంటి లోపలికి వెళ్లి తలుపు తట్టింది "ఏమండీ సర్పంచ్ గారు ఉన్నారాలోపల "బిగ్గరగా అడిగింది ."ఎవరూ....." అంటూ తలుపు తీసింది పెద్దావిడ." మేము స్కూల్లో చెత్తబుట్టలమండి "వినయంగా వంగి నమస్కారం చేసింది నాయకురాలు చెత్తబుట్ట." చెత్తబుట్టలు అయితే ఏదో ఒక మూలన పడి ఉండాల్సిన వాళ్ళు ఇలా రోడ్లు ఎక్కారు ఏందమ్మా "ముఖం చిట్లించింది ముసలావిడ. "పెద్దోళ్ళు మీరు కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడండి. న్యాయమైన కోర్కెల కోసం సమ్మెలోకి దిగాము ."మా అబ్బాయి ఇంట్లో లేడు తర్వాత రండి పోండి" అంటూ ధడేల్ మని తలుపు మూసేసింది." మేమేమీ అడుక్కునే వాళ్ళం కాదు .కష్టపడి ఒళ్ళోంచి పని చేసేవాళ్ళం ....మళ్లీ మళ్లీ రావడానికి....!" మీ కొడుకు ఎక్కడ ఉన్నాడు మర్యాదగా పిలవండి" అంటూ తలుపు దబదబా సాగింది నాయకురాలు చెత్తబుట్ట. ఈసారి ఇ సర్పంచ్ గారి భార్య, ఆయన కూతురు బయటకు వచ్చారు .ఒక చెత్త బుట్ట అమ్మాయి దగ్గరికి వెళ్లి" హే హేయ్ ఎంత ముద్దొస్తున్నావు" అంటూ బుగ్గ గిల్లబోయింది." రేయ్ మనము సమ్మెలో ఉన్నాం. గుర్తుపెట్టుకో !"అనడంతో వెనక్కు తగ్గింది చెత్త బుట్ట. "అమ్మా సర్పంచ్ గారిని పిలవండి. అప్పటిదాకా మేము ఇక్కడే ఉంటాం "అనడంతో సర్పంచ్ గారికి ఫోన్ చేసింది." ఏవండీ మన ఇంటి ముందు చెత్తబుట్టలు సమ్మె చేస్తున్నాయి. తొందరగా ఇంటికి రండి .ఇదిగో అమ్మాయి మాట్లాడతావా " అని ఫోన్ ఇవ్వ బోయింది. "ఇది ఫోన్లో మాట్లాడుకునే సమస్య కాదు. ఆయన్ను ఇంటికి రమ్మనండి. మేము ఆయనతో ముఖాముఖి మాట్లాడాల్సిన సమస్యలే ఇవన్నీ." అనడంతో ఫోన్ పెట్టేసింది" వస్తున్నాడు" అంటూ ఆమె లోపలికి వెళ్ళింది .

"ఇదిగో మీరంతా ఇటు వైపు రండి దారికి అడ్డంగా ఎవరూ ఉండొద్దు. వచ్చే పోయే వాళ్ళకు ఇబ్బంది కలిగించవద్దు. ఇటువైపు జరిగే కూర్చోండి" అంటూ ఆదేశాలు జారీ చేసింది నాయకురాలు చెత్తబుట్ట. బుల్లెట్ శబ్దం దూరంనుండి దడదడమని వినిపించడంతో "అరుగో సర్పంచ్ గారు వస్తున్నారు పైకి లేవం

డి .నినాదాలు గట్టిగా చేయండి .పెద్దగా అరవండి" అంటూ చెత్త బుట్టల్ని అప్రమత్తం చేసింది నాయకురాలు.

 చెత్త బుట్టలన్నీ పైకి లేచాయి. " పిల్లల నిరంకుశత్వం నశించాలి .టీచర్ అలసత్వం నశించాలి .బడి బడిలా ఉండాలి .బందెలదొడ్డిలా ఉండకూడదు. పరిశుభ్రతకు ప్రాధాన్యం" అంటూ బిగ్గరగా అరవ సాగాయి." అరెరే ఏందిది! చెత్తబుట్టలు రోడ్లు పట్టడం ఏంది? ఇదేంది మా పంచాయతీ చెత్తబుట్టలు కూడా గొంతు కలిపినట్టు ఉన్నాయే!" అన్నాడు వాటి వైపు చూస్తూ .

"ఎంతైనా ఒక జాతి వాళ్ళం. మాకు మేము మాట సాయం చేసుకోకపోతే ఎట్ట య్యాను రేపు మాకు ఏదైనా సమస్య వస్తే వాళ్ళ సహాయం కావాలి కదా అయ్యా!" వినయంగా వంగి చెప్పింది పంచాయితీ చెత్త బుట్ట." అది నిజమేలే ఊర్లో చెత్తబుట్టలు కూడా గొంతు కలిపినట్టు ఉన్నాయి కదా! "అవును కోరస్ గా అరిచాయి ఊర్లో చెత్తబుట్టలు. 

 ఏందంట మీ సమస్యలు సిగరెట్ ప్యాకెట్ లోంచి సిగరెట్ తీసి నోట్లోపెట్టుకొని కాలవ పోయాడు" అయ్యా... అయ్యా ...కాసేపు సిగరెట్లు కాల్చకండి. మా వాళ్ళకి సిగరెట్ పోగ బొత్తిగా పడదు" అనడంతో నోట్లో సిగరెట్ తీసి పెట్టెలో పెట్టి లో ." హా... ఇంక చెప్పండి " కుర్చీలో కూర్చుంటూ చెప్పాడు. ఎంత అహంకారము నాయకురాల్ని నేను, నన్ను కుర్చీలో కూర్చోమన కుండా నుంచో పెట్టే మాట్లాడుతున్నాడు అధికార గర్వం అనుకుంటూ కుర్చీ వంక చూసి అనుకుంది నాయకురాలు చెత్తబుట్ట." ఏంది కూర్చుంటావా! కూర్చో" అన్నాడు.

 మొహమాటంగా " వద్దులే మేము కోరికలు సాధన కోసం వచ్చాము. నుంచునే మాట్లాడుతాము లే! "బడిలో మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మమ్మల్ని ఎవరూ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. చెత్త బుట్టలమని పిల్లలు మమ్మల్ని మరీ చిన్న చూపు చూస్తున్నారు. మేము చేసే పనులే కాక అదనపు పనులు చేయిస్తున్నారు. చెత్త పనే కదా మేము చేయాల్సింది. కొంతమంది పిల్లలు బాత్రూం లో నీళ్లు పోసుకోవడానికి కూడా మమ్మల్ని వాడుతున్నారు .మరి కొంతమంది మట్టి పోస్తున్నారు. అవసరమైనప్పుడు మా చేతరాళ్లు మోపిస్తున్నారు. మేం చెత్తబుట్టలు మనేగా ఇంతింత బరువు పనులు చేపిస్తే మా గతేం కావాలి. మాకు ఏదన్న అయితే మా పిల్లలు గతేం కావాలి" అనడంతో వెనక నుండి "స్కూల్ పిల్లలు డౌన్ డౌన్ స్కూల్ పిల్లలు డౌన్ డౌన్ "అని అరవసాగారు. 

 "ఆగండి మేము మాట్లాడుతున్నాముగా!" అంటూ చెయ్యి పైకెత్తి సైగ చేసింది నాయకురాలు. 

 వెనక నుండి నినాదాలు ఆగిపోయాయి .

"ఆ ఇంకా మీ సమస్య లేంటో చెప్పండి" అన్నాడాయన.

" ఏముంది ఉదయాన్నే క్లాసురూములు సరిగ్గా వూడ్చుకోరు. ఊడ్చినా మూల చెత్త మూలన పెట్టేస్తారు. పుస్తకాలు చింపి ఉండలు చుట్టి ఆడుకుంటారు. సుచి శుభ్రత తెలియడం లేదు. చెత్త నిండితే ఎగిరెగిరి కాళ్లతో తొక్కుతారు. బయట తిరగాలి అనుకునేవాళ్ళు చదువు పేరుతో మమ్మల్ని తీసుకుని బయటకు వెళ్తారు .చెత్త కుప్పలో పారేసి, మమ్మల్ని కూడా దిబ్బ లో పెట్టి ఎటో వెళ్లి తిరిగి వస్తారు. వచ్చేటప్పుడు మమ్మల్ని కాళ్లతో తంతూ ఆట్లాడుకుంటూ వస్తారు. చెత్త లేకపోయినా ఇద్దరు పిల్లలు పట్టుకొని నడుస్తూ వెళ్తారు. పని అయిపోయిన తర్వాత జాగ్రత్తగా ఒక మూలన పెట్టకుండా ఎక్కడెక్కడో పారేస్తారు. బాత్ రూమ్ కి తీసుకు వెళ్ళిన వాళ్ళు అక్కడే వదిలేస్తారు. అక్కడ ఆ వాసన పీల్చుకో లేక పోతున్నాం "అంటూ సమస్యల చిట్టా విప్పింది.

 ఇన్ని సమస్యలు ఉంటే అయ్యోర్లు ఏం చేస్తున్నారంట" అన్నాడాయన ఆవలిస్తూ. "వాళ్లకి ఎక్కడ టైం ఉందయ్యా.... అయ్యా చీరల గురించి.... కూరల గురించి ....నగల గురించి మాట్లాడుకోవడానికి వాళ్లకి టైమ్ సరిపోదు .ఇంకా ఇవన్నీ పట్టించుకోవడానికి తీరిక ఎక్కడుంది .అందుకే ఇవేమీ పట్టవు వాళ్లకు. పిల్లలకు చెప్పి చేయించుకుంటే చేస్తారు. చెప్పే నాథుడు ఏడీ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు అయిపోయింది మా బతుకు "నిట్టూర్పులు విడుస్తూ చెప్పింది నాయకురాలు చెత్తబుట్ట ."సరే అయితే మీ డిమాండ్లు అన్ని పేపర్ మీద రాసి ఇవ్వండి. నేను తరువాత మాట్లాడతాను" అన్నాడు సర్పంచ్ పైకి లేస్తూ .రాయడం కాదండి ఇవాల్టికి ఇవాళ తేలి పోవాల్సిందే "నాయకురాలు గట్టిగా చెప్పింది." ఏంది ఇప్పటికి ఇప్పుడు అంటే ఎట్ట !నాకు అవతల బోల్డన్నిపనులు ఉన్నాయి .వాటిని వదిలేసి పరుగెత్తుకుంటూ వచ్చాను "అన్నాడాయన విసుక్కుంటూ. 

"అయినా సరే !మీరు మాతో స్కూల్ కి రావాల ఈ సమస్యలకు ఒక పరిష్కారం కనుక్కోవాల. అసలే మీ రాజకీయ నాయకులు అదిగో అంటారు. ఇదిగో అంటారు .మీకు మీ పనులు ,మీ ఆదాయాలే గాని సమస్యలు పట్టవు .ఒక పట్టాన పట్టించుకోరు. ఇయ్యాల ఈ సమస్య ఒక కొలిక్కి వచ్చిందాకా కదిలేది లేదు. మీ పనులన్నీ చూసుకొని రండి అప్పటి దాకా ఇక్కడే ఉంటాం." అనడంతో సర్పంచ్ కి కోపం వచ్చింది. "ఉండండి "అంటూ విసురుగా వెళ్ళిపోయాడు.

కాస్త దూరం వెళ్లి ,మళ్లీ వెనక్కు తిరిగి 

 నేను చీమకుర్తి వెళ్తాను.ఒంగోలు వెళ్తాను. నేను వచ్చేసరికి పన్నెండు గంటలు అవుతుంది. అప్పుడు దాకా ఇక్కడే ఉంటారా "అంటూ అరుస్తూ వచ్చాడు. "పదండి మాకు తప్పేదేముంది. ఇంటి ముందు పెట్టారుగా దుకాణం." కసురు కుంటూ బుల్లెట్ వైపు నడిచాడు.

అందరూ వెనక్కి తిరగండి. లైనుగా పదండి. నినాదాలు మొదలెట్టండి. సాధిస్తాం సాధిస్తాం.... అమరవీరుల ఆశయాలు కొనసాగిస్తాం... పోరాడితే పోయేదేమీ లేదు... బానిస సంకెళ్లు తప్ప.... అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు.... ఆనందంతో స్కూల్ వైపుకు సాగింది ఊరేగింపు.


Rate this content
Log in