హరిత జింక
హరిత జింక


ఒక రోజు రాయుడు అనే వేటగాడు అడవికి వెళ్ళాడు. చాలా సేపు అతనికి జంతువులు దొరకలేదు. ఇంతలో ఒక జింక అతని కనుల పడినది..వెంటనే బాణాన్ని గురి చూసి వదిలాడు. బాణం దెబ్బతో జింక నొప్పితో వనదేవతను ప్రార్థించగా ఆమె ప్రత్యక్షమై వేటగాడిని "ఓరీ.. దురాత్మా.నీవూ జింకగా మారిపో, అప్పుడే నీకు జీవుల విలువ తెలుస్తుంది" అని శపించెను.
జింకాగా మారిన వేటగాడు అడవిలో అనేక కష్టాలు పడ్డాడు.ఆకులను తినలేడు ఎందుకంటే శరీరం జింకదే అయినా మనసు మనిషిది.
ఒకరోజు మరో వేటగాడు ఈ జింకను తరమసాగడు. రాయుడు ప్రాణ భయంతో పరుగులు పెట్టాడు. రేయ్ నేను జింకను కాదురా మనిషిని అనాలని ఉంది కానీ చెప్పలేడు.ఒగురుస్తూ తప్పించుకుంటూ పరుగులు పెట్టాడు. అప్పుడు తెలిసింది ప్రాణం విలువ. తను ఎన్నో జీవులను చంపాడు కదా.. అవన్నీ ఎంత భాదను అనుభవించాయో..అయ్యో ఇప్పుడెలా..నన్నెవరూ కాపాడుతారు.."అమ్మా, నన్ను రక్షించు.ఇంకెప్పుడూ వేటకు రాను." అని వనదేవత ను ప్రార్థించగా ఆమె ప్రత్యక్షమై వేటగాడిని రక్షించి..మామూలు మనిషి గా మార్చింది.
రాయుడు ఆమె పాదాలకు నమస్కరించి జంతువులను పక్షులను కాపాడటమే నా పని అని ఆమెకు మాట ఇచ్చి ఇంటికి బయలుదేరాడు.
జంతువులను వేటాడి చంపడం..భూమిపై మనిషి ఉనికికే ప్రమాదం..