Bhagya sree

Children Stories

4.2  

Bhagya sree

Children Stories

పిడుగు.ఋడుగు2.0 వెర్చన్.పలిచయం

పిడుగు.ఋడుగు2.0 వెర్చన్.పలిచయం

2 mins
789


నా పేలు సుబ్లమణ్యం నన్ను మా అమ్మ అప్పుడప్పుడు ఆరి పిడుగా! అంటుంది. మా అమ్మకి బాపు తాతంటే, అంటే బొమ్మలు గీసే బాపు తాత. నాకేమో రజినీకాంత్ అంటే ఇష్టం అందుకని నేనే పెట్టేస్కున్నా నా పేరు పిడుగు..... బుడుగు 2.0వెర్చన్ . బాగుంది కదా! ఎందుకు బాగోదు? బోలెడు లీసెచ్ చేసా, లీసెచ్ అంటే పలిచోదన.... అందుకే చదువుకోవాలనేది.


ఇంతకీ నా వయచు చెప్పలేదు కదూ ! నా వయసు మూడున్నర సంవత్సరాలు. మా బామ్మ వెలెడంత లేవు ఏవిటా పెద్దరికపు మాటలు అరగుండు వెధవా అంటూ ఉంటుంది ....నా పెద్ధలికానికేం తక్కువ, నా అనుభవాలు చెప్పలేదు కదూ!! చెప్తా...జాగ్లత్తగా వినండే.

అమ్మ నన్ను ఒక్కోసారి కిట్టయ్య కన్నయ్య అంటుంటుంది అది నా కలల్ మహిమ అంటే లంగు.మా అమ్మ నన్ను పదకొండు నెలలకె అంగన్వాడీ లో వేచేచింది .అయ్యొ! అని ఎక్కువ జాలి పడకండి...మీకు తెలుసుగా నా దాలి లహదాలి. అంగన్వాడీ లో రోజుకి గంట మాత్రమే. మరి మా అమ్మకి ఇంటి పనవ్వాలిగా..నన్నుంచి చేసుకుందామంటే నా ట్లాక్ లికాల్డ్ మా అమ్మ కి తెలియదా ఏంటి


పోన్లె పాపం...అని ఎడ్వకుండా ఉండే వాణ్ణి...మనసులో( చాక్లెట్, బిస్కెట్ తింటున్నాగ).

ఏడు నెలల తరావత నాకు సంవత్సరంన్నరవచ్చింది బళ్ళో పడేసింది మావాడికి మాటలన్ని వచ్చు అని పంతులమ్మకి చెప్పి మురిసిపోతు బుగ్గను గిల్లి మద్దులు పెట్టి తల నిమిరి బళ్ళో బాగా ఆడుకో అని నలసి లో జాయిన్ చేసింది


మళ్ళి సంవత్సరం కూడా నల్సలియే ఇప్పుడు మా అక్క చదివే బడి.... మీకు చెప్పలేదు కదూ! నాకొక అక్కుంది... చాలా అమాయకులాలు ..నే అల్లరి చేసినా, అదే అల్లరి చేసినా దాని కె దెబ్బలు. బడికెళ్ళే ముందు దేవుడికి దండం పెడతాను నాకు భక్తి ఎక్కవ మనసులో,( ఈ రోజు ఎవడో ఒకడి పుట్టిన రోజుండాలి... ప్లీజ్.....).

           

  మా ఆయమ్మ నేను మంచి దోస్తులం మిఠాయిల దోస్తి నా కో రెండు చాక్లెట్ ఎక్కువ పంచేది‌. నేను తినేసిన తర్వాత ఆ ముచ్చురేకుని చాలా జాగ్రత్తగా దాచి ఇంటికెళ్ళి న తర్వాత మా అక్క కి చూపిస్తూ ఊలిస్తా , దానివి ముందు రెండు పల్లూడిపోయాయ్ అయినా ఒకటిన్నర రాగం అందుకుంటుంది మా అమ్మ వాయున్నర వేగంతో వస్తుంది...ఇక చెప్పను నా పరువు పోతుంది

అలా రెండు సంవత్సరాలు కట్టపడి నలసలి చదివి ఇప్పుడు LKG ...ఇంత అనుభవమున్న నన్ను వేలడంత లేవు అంటే...కోపం రాదా మీలే చెప్పండి

     

          ఒక మాట ...చెవి ఇలా పారెయ్యండి నాకు emoji చాక్లెట్లు బిస్కెట్లు పెట్టకండే మా అమ్మ మిమ్మల్ని తిడుతుంది వీలైతే చక్కిలాలు, నువ్వుండ్లు, పప్పుండ్లు జంతికలు, చుప్పులు, సున్నుండలు, అరిసెలు బూరెలు వడలు ఇవే పెడుతుంది ఆరోగ్యానికి మంచిదని ...వీలుంటే emoji ల్లో ఇవి వెతకండేం మరి మన food కూడా ఉండాలిగా emoji ల్లో ...try చేయండి


     మళ్లీ వాలం.... కలుద్దాం. 🕴️


భాగ్యశ్రీ✍️

   Rate this content
Log in