Bhagya sree

Children Stories Comedy

4  

Bhagya sree

Children Stories Comedy

ఇంకుడు గుంత... పిడుగు

ఇంకుడు గుంత... పిడుగు

2 mins
578


అయ్యో! ...మా నాన్నారిని మీకు పరిచయం చేయలేదే..అందుకే కాత్త ఇంట్లో ఉండండి పెద్ధవాళ్లతో పలిచయం చెస్తా అన్నా నా మాట వింటేగా..

ఏంటో అంత బిజీ ..నా కన్నా బిజిగా మా నాన్నారేం చేస్తారో నాకల్దం కాదు. మా నాన్నారు మహేష్ బాబులా ఉంటారు. నేనడిగినవి అన్నీ కొనిత్తే మా నాన్న మహేష్ బాబు కన్నా బాగుంటాడు కానీ నా మీద కోప్పడుతున్నప్పుడు ఎవంజెల్స్ లో మహా థేన్లా ఉంటాడు.

ఆగండాగండి మా నాన్నారు ఎక్కడున్నారో వెతుకుతాను...ఆ....దొరికారు.

మా నాన్నా రు ఇంటి చుట్టూ ఏదో తవ్విత్తూ వున్నారు

"ఏంటీ నాన్న ఆ లంగన్న తాత ఏం చేత్తున్నాడు" అడిగా

"ఇంకుడు గుంతలు తవ్విస్తున్నా" అన్నాడు నాన్నా రు

"ఎందుకు" అనడిగా

"మేం నీళ్లన్నీ వాడెస్తే నీకు ముందు ముందు నీళ్లు ఉండాలిగా అందుకని గొయ్యి తవ్వి ఇందులో నీరు ఉంచుతానూ..సరేగాని నాన్న కొంచెం అటువైపు వెళ్లు మట్టి తుళ్లుతుంది" అని నా చెయ్యి పట్టుకొని కొంచెం దూరం తీసుకుని వెళ్లి నించోపెట్టాడు 

నాకైతే మా నాన్నమ్మ చెప్పిన మూడు చేపల కథ గుర్తుకు వచ్చింది ... వెంటనే నేనూ గొయ్యి నా చేత్తో తవ్వడం మొదలు పెట్టా..

 నేను తవ్వుతుండగా లెండు పేద్ధ పాదాలు వచ్చి నా చిన్న గోతి దగ్గలకొచ్ఛి ఆగాయి‌. నాకు పక్కనే దొలికిన కర్ర పట్టుకుని ఒక్కటి తగిలించా! అప్పుడు అబ్బా! అనాలిగా కాని ఏరా! అని వినిపించింది. 

ఇదేదో మా నాన్నారి సౌండింగ్ లా వుందే అని తల ఎత్తా మా నాన్నా రే "దూలం...దూలం మట్టి తుళ్లుతుంది" అంటూ వుంటే మళ్లీ ప్రశ్న

"ఏం చేస్తున్నావురా" అని

మేం తేలీక అల్థం కాక ఏవేవో విషయాలడిగితే వీళ్లకి కోపాలొఛ్చేస్తాయ్ మేము సీరియస్ గా పని చేస్కుంటుంటే ఎదురుగా కనిపిస్తున్నా సలే అడుగుతారు ఏం చేస్తున్నావని మీ పెద్ధాలున్నాలే....

మళ్లీ అదే ప్రశ్న

"ఏం చేస్తున్నావురా" అని

నువ్వు ఇంకుడు గుంతలు తవ్వించి సుమతివి అయిపోయి నన్ను మందమతిని చేద్ధామనుకుంటున్నావా అదేం కుదలదు నేను సుమతినే అందుకే ఇంకుడు గుంత తవ్వుతున్నా మా పిల్లల కోసం అని అంటుండగా మా లంగన్న పెద్దగా నవ్వు నవ్వాడు


"ఏంటి రంగన్నా అంత పెద్ద గా నవ్వుతున్నావ్" అని అడిగాడు మా నాన్నా రు

"ఏం లేదు బాబు తాత మనవడు సినిమా యాదికొచ్చి మనం ఏది సేస్తే బిడ్డలు అదే సేస్తారు, మనం మంచి సెస్తే మంచే సేస్తారు. ఏదేమైనా మా సిన్న దొర పేద్ధ కలెక్టేరు అవుతాడు" అన్నాడు

ఆ మాటకి నాకు మా బాగా కోపమొచ్చింది ముందే చెప్పాగా నాకసలే మా చెడ్డ కోపం ఈ తాతగాడెవడు నన్ను కలక్టల్ చేయడానికి నేను పెద్దయ్యాక స్పైడర్ మ్యాన్ అవుతా 

..మళ్లీ కలుద్దాం ఈలోపు కాలిగా వుండకుండా మీలు తవ్వండీ ఇంకుడు గుంతలు.....

..మీ పిడుగు..... బుడుగు 2.0 వెర్చన్

                           .. భాగ్యశ్రీ✍️Rate this content
Log in