Bhagya sree

Comedy

3.3  

Bhagya sree

Comedy

శ్రీ వారి కడియం...హరిలో రంగా హ

శ్రీ వారి కడియం...హరిలో రంగా హ

3 mins
377"ఏంటంత ఆలస్యం, కాణీ సంపాదన లేదు గాని ఊళ్లో ఘనకార్యలకేం లోటు లేదు " అని చేతులూ పుతూ గద్దించింది ఎప్పట్లానే సీతామాలక్ష్మి శ్రీవారిని 

"ఈ సారి ఘనకార్యమే చేశానే, ఎంత కష్టపడినా కాణీ సంపాదన రావట్లేదని ఒక స్వామీజిని అడిగాను ఆయనేమో రెండో పెళ్లి చేసుకుంటే కలిసి వస్తుందని అన్నారు, అలా చేయొచ్చో చేయకూడదో అని చిన్న అనుమానమొచ్చి మా స్నేహితుల దగ్గర ఈ విషయం చెప్పి సలహా అడిగా.... వాళ్లేమో అది నిన్నడిగి తేల్చుకోవలసిన విషయం అని చెప్పారు..ఏం...ఏ చేయమంటావ్" అని ఆక్రోశం గా అరిచాడు శ్రీహారి. 

ఆ అరుపు మేక సింహాన్ని మిమిక్రీ చేసిన్నట్టుంది 

"ఏం మతి గాని పోయిందా! ఏమిటా మాటలు అ..అవ్వా! నలుగురు వింటే జబర్థస్త్ స్కిట్ రిహార్సల్స్ జరుగుతున్నాయనుకొని కొంప మీదకొచ్చి పడతారు కాస్త ఆ కంపు నోరుముయ్యండి " కాస్తా ఎగతాళి చేసింది సీతామాలక్ష్మి 

"ఏం ! నేను వేషాలేసే వాడిలా కనిపిస్తున్నా నా! నిజంగానే నీతో ఏమి కలిసి రావడం లేదు, కాణీ సంపాదన లేదు ...నేను నిర్ణయం తీసుకున్నా" సింహం గట్టిగా గాండ్రించింది 

"ఏంటిది ఎప్పుడూ లేనిది ఇలా అరుస్తున్నారు... అసలు నా మీద అరిచేంటంత దైర్యం ఎక్కడ నుంచి వచ్చిందీయనికి? ఇంకా ఈ విషయాన్ని సాగదీస్తే నా కొంపే మునిగేట్టుంది" అని మనసులోనే అనుకుని సరాసరి కూత వేటు దూరంలో ఉన్న పుట్టింటికెళ్లి విషయాన్ని ,వివరంగా, విపులంగా, విచారంగా, నిదానంగా అమ్మ చెవిలో వేసింది సీతామాలక్ష్మి 

"అందుకే అమ్మాయ్ చేప్పేది ఎప్పుడూ అరవద్దు అప్పుడప్పుడైన ప్రేమగా ఉండమంటే విన్నావ్కాదు ఇప్పుడు చూడు అసలుకే ఎసరొచ్చిపడింది.... ఇంతకీ ఆ సాములోరెవరో తెలుసా!" అని సంశయించింది వాళ్లమ్మ 

"ఆ! తెలుసమ్మా" అంది సీతామాలక్ష్మి

"మరింకేం, పద పోదాం! వాడి సంగతి" అంటూ దీర్ఘాలు తీస్తూ చీర కొంగు దోపి బయల్దేరారు తల్లి కూతుళ్లీద్దరు.

*********** 

"సాములోరు ఇదెమైనా పద్దతా? ఇలా కాపురాల్లో చిచ్చు పెట్టొచ్చా ?రెండో పెళ్లి చేసుకుంటే కలిసొస్తాదని మా అల్లుడితో చెప్తావా! నువ్వు అన్నం....."అని అనబోతుంటే 

స్వామిజి ఆపి, ప్రపంచ శాంతి ని కాపాడుతున్నది నేనే అన్నట్టు తన కళ్లతో నవ్వుతూ మనసులో కలవరపడుతూ కాస్త తడబడుతూ .... అసలు మీరెవరు విషయం ఏమిటి? 

సీతామాలక్ష్మి అమ్మ గారు ఆసాంతం అభినయిస్తూ విషయాన్ని చెప్పి... నువ్వు కాదూ ఈ పాపం మూటగట్టుకుంది" అని నిలదీసింది 

"నేను కాదు తల్లి నేను కాదు..అలాంటివి నేనెప్పుడూ చెప్పను, అలాంటి పాపాలే చేసుంటే ఈపాటికి నన్నిక్కడినుంచి తరిమయ్యెరా మీలాంటి పతివ్రతలు" అన్నారు స్వామిజి శాంతి స్వరూపము 

"మీరే అన్నారన్నాడు మా అల్లుడు" అని అడిగిందనుమానంగా 

"మీరేమనుకోకుండా....నా మాట వింటాను అంటే ఒక మాట చెప్తాను వింటారా?" అని స్వామిజీ వాళ్లిద్దరి మొహాలవైపు తీక్షణంగా చూస్తూ అడిగారు స్వామిజీ 

తల్లీకూతుళ్లిద్దరూ బళ్లో పిల్లలా రెండు చేతులు కట్టుకుని "ఊ....ఊ" అన్నట్టుగా బుర్రలు ఊపారు 

"అది మీ ఆయన ఆలోచన అనుకుంటానమ్మా! నన్ను అడ్డుపెట్టి అలా చెప్పుంటాడు" అని చాలా విచారంగా మొహం పెట్టాడు స్వామిజీ 

"అంతేనంటరా స్వామి! మరి దీనికి పరిష్కారం ఏదైనా వుందంటారా" అని చాలా బాధగా అడిగింది సీతామాలక్ష్మి 

"పరిష్కారమంటే? మీరు చేయగలరో లేదో" అని ఆగిపోయాడు స్వామిజీ 

"చెప్పండి స్వామిజీ చేస్తాం" అని తల్లి కుతుళ్లిద్దరూ "ప్రెజెంట్ సార్" అన్నంత ఎలర్ట్ గా అన్నారు 

" ఆ చేతుల రెండు బంగారు గాజులు తీసి వాటిని తీసి బంగారు కడియం గా మార్చాలి" అని చెప్పాడు స్వామిజీ 

స్వామిజీ చెప్తున్నప్పుడు సీతామాలక్ష్మి వాళ్లమ్మ మనసులో "ఆరి దొంగసామి! మా అమ్మాయ్ గాజులు మీద పడిందే నీకన్ను దాని చేతులకి డజను గాజులుంటే రెండింటిమీదే పడిందెందుకో?" అని అనుకుంది 

అంతలో స్వామిజీ " ఏమిటమ్మా ఆలోచిస్తున్నారు ఆ కడియాన్ని" అని అంటుండగా 

"మీకు సమర్పించాలి అంతేగా!" అని చేతులూపుతూ మూతితిప్పింది సీతామాలక్ష్మి వాళ్లమ్మ 

"కాదమ్మా! నేనొక మంత్రం చెప్తాను అది మనసులో అనుకుని మీ అమ్మాయి వాళ్లాయన కి సమర్పించాలి" అని నవ్వుతూ చెప్పాడు స్వామిజీ 

"అలా చేస్తే మార్పు వస్తుందంటారా?" అని ప్రశ్నించింది సీతామాలక్ష్మి అమాయకంగా 

"ఎప్పుడూ మీ ఆయనతో నవ్వుతూ మాట్లాడాలి, ఆయన్ని విసిగించడం తగ్గించాలి, కాస్త ప్రేమగా ఉండాలి" అని ప్రశాంతంగా వివరించారు స్వామిజీ 

"అలా ఎన్ని రోజులుండాలి" అని ధర్మసందేహం అడిగినట్టుగా అడిగింది సీతామాలక్ష్మి 

ఈ అనుకో ని ప్రశ్నకి తికమకపడీ తనలో తానే "శ్రీ రామచంద్ర ప్రభో భర్తతో ప్రేమగా ఉండమంటే - ఎన్నిరోజులు అనే కాలం దాపురించింది" అని అనుకుని , ఆపై తమాయించుకుని మళ్లీ యథావిధిగా అరమోడ్పు కన్నులతో "ఒక ఆరునెలలు" అని సమాధానమిచ్చారు స్వామిజీ 

*********** 

"ఓరై బావా! నా కోరిక తీరిందిరా కేజిలకి కేజిలు ఒంటి మీదకి దిగేస్కోడమే కాని పక్కన మొగుడు దిష్టిపిడతల వున్నాడు వాడికి ఏదైనా వేద్దాం అని ఎప్పుడూ ఆలోచించలేదురా మీ చెల్లి కాని ఇప్పుడు" అంటూ చేతికున్న బంగారు కడియాన్ని చూసి మురిసిపోతూ తన ఫ్రెండ్తో ఆగకుండా మాట్లాడుతున్నాడు 

"బావా! దెబ్బకి దెయ్యం దిగిందిరా మీ చెల్లికి...ఆ స్వామిజీ నీకెక్కడ దొరికాడ్రా నా పుణ్యానికి" అని పరమ సంతోషం గా ముసి ముసిగా నవ్వుతూ పట్టలేనంత ఆనందంగా అడిగాడు శ్రీ హరి తన ఫ్రెండ్ని 

" ఆయన కూడా భార్యా బాధితుడే! స్వామిజి అవతారమెత్తారు అంటూ ఇంతకీ నువ్వెక్కడున్నావ్" అని అడిగాడు 

"ఇంట్లో నేరా" అని చెప్పాడు శ్రీహరి అంతే ఆనందంగా 

"వెనకముందు ఎవరైనా ఉన్నారా చూస్కొని మాట్లాడరా" అన్నాడు కాస్త హెచ్చరించినట్టు గా 

"ముందు ఎవరూ లేరు ...వెనక అని చూసేలోపే అయిదయిదు బంగారు గాజులున్న రెండు చేతులు తన భుజాల మీద ఉండడం గమనించిన శ్రీహరి 🙄😒😔😕😖😟😨 

ఆ...తెలియక అడుగుతున్నా.......తర్వాత ఏమయ్యుంటదంటారు? 

                            .            Rate this content
Log in

Similar telugu story from Comedy