sai teja

Children Stories


5.0  

sai teja

Children Stories


కోసే కత్తి అతికించదు...

కోసే కత్తి అతికించదు...

1 min 150 1 min 150

ఒక ఊరి లో రాము-హరి అను ప్రాణ మిత్రులు ఉండే వారు.రాము మిక్కిలి శాంతి పరుడు తెలివైన వాడు, హరి తెలివైన వాడు కానీ ముక్కొపి. మిత్రునికి విపరీతమైన కోపం అని తెలిసిన రాము ఒక రొజు ఇలా అన్నాడు '' ఇదిగో !ఈ బస్టాడు మేకులు ,ఈ సుత్తి తీస్కొ.నీకు బాగా కోపం వచ్చిన్నప్పుడు ఈ మేకులు ప్రహరీ గోడకు దించు''. హరి సరే అని చెప్పి కోపం వచ్చినప్పుడల్లా మేకునిగోడలోకి దిగెయ్యటం మొదలు బెట్టాడు. కొన్ని రోజులకి గోడంతా మేకులతో నిండిపోయింది. బస్టాడు మేకులు అయిపోయాయి. ఈ మేకులుకొట్టే క్రమంలో మెల్లగా రోజుకి కొట్టే మేకుల సంఖ్య తగ్గి రోజుకి ఒక మేకు కూడా కొట్టని పరిస్థితి వచ్చింది. ఈ విషయం గమనించిన రాము సంతోషించి రోజుకొన్ని మేకులు పీకేయ్యమని చెప్పాడు.


హరి రోజూ కొన్ని మేకులు పీకేస్తు మొత్తానికి మేకులన్నీ పీకేసి రాము కి చూపించాడు. రాము మేకులుపీకేయ్యగా ఉన్నగోడలోని చిల్లులన్నీ చూపించి, “ఈ గోడని ఎంత రంగులు వేసినా ఈ కన్నాల వల్ల బాగు పడదు. అలాగే మనం మన కోపంతో ఎవరి మనసునైనా కష్టపెడితే, తరవాత మనం ఎంత కష్ట పడ్డా వాళ్ళ మనసుకి అయిన గాయాన్ని పూర్తిగా మాన్పలేము,” అన్నాడు.


కోపం చాలా ప్రమాదకరమైన కత్తి వంటిది. ఒక మనిషి ని కత్తి తో గాయం చేస్తే, గాయం కొన్నాళ్ళకి మానవచ్చు కానీ దాని తాలూకు మచ్చ పోదు. 


Rate this content
Log in