Dr.R.N.SHEELA KUMAR

Children

4.2  

Dr.R.N.SHEELA KUMAR

Children

మా ఊరి బడి

మా ఊరి బడి

2 mins
724


అది ఓ చిన్న ఊరు. ఊరిలో ఎప్పుడు పొలం పనులతో ఖాళీ లేకుండా ఉండే ప్రజలు. అక్కడక్కడా కిరాణా కొట్లు, ఓ వైపు దుర్గమ్మ గుడి మరో వైపు గాయత్రీ అమ్మవారు, అంజినేయ స్వామి గుడులు. ఊరి మధ్యలు ఓ చర్చి. ఆ అందులో ఉందండి మా ఊరి బడి. దగ్గర దగ్గర 70.80 ఏళ్ళండి ఆ బడికి. మా ఊరి డాక్టర్ నుండి బడి పంతులు, గుడి పంతులు వరకు అందరు అక్కడే చదివేరండి. ఈ ఊరిలో నాలుగు తరాల వారు ఇక్కడే చదివేరు. అందుకే టీచర్లకు పిల్లల మీద అంత అభిమానం. ఏ విద్యార్థిని ని చుసిన వాళ్ల అమ్మ, నాన్న వీళ్ల దగ్గరే చదువుకున్న వారైనా వుంటారు అందువలన ఆ బడిలో బేత్తానికి అవకాశమే లేదండి అంతా ఓ కుటుంబం లా వుంటారు ఆ బడిలో లెక్కలు మాస్టారంటే అందరికి దడ. లెక్కలు కదండీ అంతేకదా మరి. మన బుజ్జమ్మ 7వ తరగతిలో ఆ లెక్కల మాస్టారు ఎప్పుడు క్లాస్ వర్క్ అడిగిన ఇదిగోనండి అదిగోనండి అంటూ కాలాన్ని దాటేసి పరీక్షలు రాసి పాస్ అయ్యి zp స్కూల్ లో జాయిన్ అయ్యింది. ఓ రోజు జోరు గా వర్షం స్కూల్ వదిలే సమయానికి వర్షం తగ్గక పాపం అఆ లెక్కలు మాస్టారు తుడుచుకుంటూ ఇంటికి వెళ్ళటం బుజ్జమ్మ వాళ్ల అమ్మ చూసి మాస్టారు రండి మా ఇంట్లో కూర్చొని వర్షం తగ్గాక వెళుదురుగని అంటూ శిషరాలు పిలిచింది. సరేనమ్మా అంటూ మాస్టారు ఇంటిలోపాలకు వచ్చేరు కాఫీ తాగేరు వర్షం తగ్గి బుజ్జి ఇంటికొచ్చేసింది. అంతే మాస్టారుని చూసి గుండాగిపోయినంత పనయ్యింది పాపకి. దాన్ని చుసిన మాస్టారు కి నవ్వు ఆగలేదు వెంటనే శిష్యురాలితో నీ కూతురు నాకే హల్వా ఇచ్చిందే శేషు అంటూ జరిగింది చెప్పారు. నా సర్వీస్ లో ఇంత ఘాటుకురాలిని నేను చూడేలేదురా అంటూ వెళ్లిపోయారు. వెంటనే అమ్మ నా పరువు తీసేవు కాదే అంటూ తిడుతుంటే అక్క వచ్చి ఏంటమ్మా చెల్లయిని తిడుతున్నావు అది ఎంత చక్కగా మాస్టారికి ఓ జ్ఞాపకాన్ని మిగిల్చింది లేకపోతె నీతో ఇంతసేపు మాట్లాడేవారా. అంటూ తన చెల్లాయి ని ఆడుకోవటానికి తీసుకు వెళ్ళిపోయింది. ఇదండి మా ఊరి బడి చిన్న చితక ఉద్యోగాలు, వ్యవసాయం ఏ పని చేసే వారైనా ఒకటో తరగతి నుండి ఏడో తరగతి వరకు ఇక్కడే చదివి తీరల్సిందే.


Rate this content
Log in

Similar telugu story from Children