విశిష్టమైన విశాఖపట్నం
విశిష్టమైన విశాఖపట్నం
అతిశయ అరుదైన మహానగరం మన సువిశాల సుమనోహర విశాఖపట్నం,
ఊరు సమీపంలో ఉన్నది సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనరసింహ పుణ్యక్షేత్రం,
ప్రాకృతిక అందాల సోయగాలను నింపెను అలల సవ్వడి గల సముద్ర తీరం,
ఐశ్వర్యాభివృద్ధి పురోభివృద్ధి ప్రసాదించెను శ్రీ కనకమహలక్ష్మీదేవి ఆశీర్వచనం ।౧।
వాగ్గేయకారులు శ్రీకాంత కృష్ణమాచార్యుల భక్తిరస సంకీర్తనలు అపూర్వం అద్వితీయం,
చిరస్మరణీయం భౌతిక శాస్త్రవేత్త భారతరత్న శ్రీ చంద్రశేఖర రామన్ గారి ఆవిష్కరణం,
మహామహోపాధ్యాయులు శ్రీనూకల సత్యనారాయణగారి శాస్త్రీయ సంగీతం ఎంతో అనన్యం,
శ్రీశ్రీ ఆరుద్ర గొల్లపూడి సిరివెన్నెల సీతారామ శాస్త్రుల గీత రచనలు ఎల్లప్పుడూ అపురూపం |౨|
వాల్తేరు పట్టణం నందు ఉన్నది భారతదేశ ప్రథమ నౌకానిర్మాణ కేంద్రం,
ఉత్తరాంధ్ర తూర్పు కోస్తాకి నావిక వాణిజ్యం ఇచ్చెను నైసర్గిక నౌకాశ్రయం,
దేశసీమకి ఇంధనం ఇచ్చెను వైజాగ్ ఉక్కునగర శిలాతైల శుద్ధికర్మాగారం,
విశాఖ మహాపట్నం ఉన్నత పారిశ్రామికీకరణ నిమిత్తం ఒక ప్రధాన కేంద్రం |౩|
విద్యాసంస్థలలో అంకితం వెంకట నరసింహ కళాశాల ఒక మణిహారం,
సమస్త శాస్త్రములు నేర్పేను విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం,
రామకృష్ణ ఋషికొండ భీమిలి రేవు ప్రాంతాలు పర్యటనంలో అలంకారం,
విశిష్టమైన విశాఖపట్నం ఆంధ్రుల కోసం నిత్యం ఒక పరిమళ పారిజాతం |౪|
