STORYMIRROR

T. s.

Abstract Classics

4  

T. s.

Abstract Classics

కలం

కలం

1 min
409

ఝలిపించు కలం ఖడ్గం కంటే వేగంగా...

ఝలిపించు కలం కల్లలు మాట్లాడే కుత్తుకలు కోయగా

ఝలిపించు కలం చీకటి కుహరంలో దాగిన నిజాలు బట్ట బయలు చేయడానికి

కణకణ మండి జ్వలించే హృదయం కోసం...

ఝలిపించు కలం నిగ్గుతీసి నిజం చెప్పిన నీదే జయమని నమ్మి నిశిలో వెలుగు రేఖలు తరలించే తరుణం...

ఝలిపించు కలం అబద్ధాలను ఖండ ఖండాలుగా ఖండించడానికి నివురు గప్పిన అబద్ధం నిగ్గు తేల్చడానికి...

ఝలిపించు కలం మనసు కంటే వేగంగా...

జ్ఞాపకాలను నుసి అయ్యే నిప్పు రవ్వలుగా

భగభగమండే లావాలా మనసును కార్చిచ్చులా కాల్చివేస్తుంటే నిత్యం కాలుతున్న కాష్టంలా ఆరని అగ్ని పర్వతంలా మనసు దహించుకుపోతుంటే 

ఝలిపించు కలం ఖడ్గం కంటే వేగంగా...



Rate this content
Log in

Similar telugu poem from Abstract