వడలిన వృక్ష దేహం
వడలిన వృక్ష దేహం


వడలిన దేహ వృక్షం
********************
సంసార సాగరాన్ని ఈది
శిధిలమయిన దేహం ఇది..
రంగుల లోకం మాయమై
తెల్లని శూన్యం నిండిన మనసు ఇది..
అనుభవాలు ముడతలుగా మారి
అందవీహినమైన శరీరం ఇది..
సత్తువంతా ఇంకిపోయి వడలిన
దేహవృక్షం మృత్యగూటికి చేరువవుతోంది..
అణచివేతల పొరలు చీల్చుకుని
ఎన్నో పరీక్షలకోర్చి మలుపులమెలికలు
నేర్పుతో దాటిన జీవితం ఇది..
ఓదార్చే వారు లేక ఒంటరితనానికి లొంగి
శేషజీవితం శాపమై జ్వలిస్తుంది..
మూగజీవాల చెలిమే మనసుకు సాంత్వననిస్తుంది..
అనుభూతులే ఆలంబనగా మలి వయసు పయనానికి తొలి అడుగు ప్రారంభించు..
ఏకాకితనం కాదది ఒంటరితనమని భావించి ఆస్వాదించు..