తపన-తపస్సు
తపన-తపస్సు
అంశం: నీలి రంగు..
నీలి ఆకాశం ఆరాటం..
ఆ ఆది దేవుని అనుగ్రహమే తన ఆశయం..
నీలి సముద్రం పైన
హిమగిరుల్లో నివసిస్తున్న నీలాంబరేశ్వరుడు
తపస్సమాధిలో నిరంతరం యోగ ముద్రలో నెలకొన్నాడని హిమాలయాలకు వెళ్దామనుకున్నాన!
కదలలేని నా నిస్సహాయతకి ఆ నీలాంబరుడు నీకెందుకే తామసి, తాపసిలోకం నీది కాదన్నాడు..
నీలి ఆకాశమై నింగి, నేలని ఏలుకొమ్మని,
తానేమో హిమవంతుని పుత్రికతో హిమ గిరుల్లో
నీలి సముద్రం పైన నిలిచి నింగిని,నేలని చూస్తూ ప్రశాంత వదనుడై శాంతి ఢమరుకాన్ని మోగిస్తున్నాడు..
ఆ నీలి ఆకాశం భక్తితో హిమగిరిపై మోకరిల్లి ఆ ఆది దేవుని అనుగ్రహంకై ఎదురు చూస్తుంది..
