తొలి వలపు తుది మలుపు
తొలి వలపు తుది మలుపు
తొలి చినుకు పుడమికి ముద్దు
తొలి స్పర్శ , వధువరులకు ముద్దు
తొలకరి జల్లు వసంతానికి ముద్దు
మరువలేనివి...మరిచిపోలేనివి
నీ మొదటి చూపు...
నీ మొదటి నవ్వు....
నీ మొదటి మాట...
నా జ్ఞాపకాలోంచి మొలకెత్తుతూనే ఉంటాయి
ఎన్ని మొహాలు నా మదిని కమ్మేసిన
ఊపిరి ఉన్నంతవరకు
తొలి వలపు నీవే....
ఇవి నా అబద్ధపు ఊహలు
తెలిసి తెలియని పసి మనసులో
ముద్రించబద్ద తీయ్యని మాటలు
నన్ను నేను మోసం చేసుకున్న సిద్ధాంతాలు
జీవితంలో అనుభవంలో అవి రంపపు కోతలు
తుది మలుపు .......
నా జీవితంలో ఒక సాయంత్రం
కీచక పర్వం నన్ను అనంత దుఃఖంలోకి నెట్టింది
నాకు వ్యథను మిగిల్చి
నన్నొ శిలగా మార్చి పొమ్మన్నాడు
మింగుడు పడని మాత్ర
మింగవలిసి రావడం
బిళ్ళను మింగలేక మింగాను
నన్ను నేను చంపుకోలేక,
నా మనస్సును చంపుకొని
నేను ఒక గర్భనిరోధక మాత్రను మింగి
నా పదహరో సంవత్సరంలో ఒక హత్యచేసి
నాకు నేను ఏనాడో మరణించాను
అమాయకత్వంలో అన్ని అద్భుతాలే
మొదటి చూపు.......
మొదటి నవ్వు.........
మొదటి మాట..........
అనుభవంలో అన్ని
అత్యాచారలే.....రేపులే.....మానబంగాలే.......
