STORYMIRROR

VENKATALAKSHMI N

Abstract Tragedy Inspirational

4  

VENKATALAKSHMI N

Abstract Tragedy Inspirational

తగిన మూల్యం

తగిన మూల్యం

1 min
351

ఒక్క నిమిషం చాలు

అపార్ధం ఆవహించడానికి

నిజాన్ని నిగ్గు తేల్చడానికి

బంధాలను కలపడానికి

బాధ్యతలను తుంచడానికి

మోహపు పొరలు కమ్మడానికి

మోసపు తెరలు కప్పడానికి

నిండు ప్రాణం నిలపడానికి

మెండు జీవితం నిలబెట్టడానికి

భవిష్యత్తు అంధకారం కావడానికి

విపత్తు వచ్చి ముంచడానికి

ప్రశాంత గోదారి ఉప్పెనల్లే మారడానికి 

గమ్యస్థానం అంచున చేజరడానికి

అందివచ్చిన అవకాశం

గుప్పిట ఇసుకల్లే చేజారడానికి

ఊపిరి గాలిలో కలవడానికి

అందుకే నిమిషమేనంటూ నిర్లక్ష్యం వద్దు

నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం 



Rate this content
Log in

Similar telugu poem from Abstract