స్వప్నరాగలీల అతను
స్వప్నరాగలీల అతను


పనికి అర్థం తెలిసినవాడు
పనిని జీవితంగా ప్రేమించినవాడు
పనిలో ఆనందాన్ని వెతుక్కునే సదానందుడు
శ్రమశక్తిని ధారపోసే కర్మజీవి
కలలు కనటం తెలీదుకానీ
కలలను వెలిగించినట్టు
ఆకాశవాణి దీపకాంతుల దివిటీ అతను
చిరునవ్వుతో సమస్యలను పరిష్కరించే సవ్యసాచి
కసురుకునే మనుషులు..
ముసురుపట్టిన ఆలోచనలు..
ఎక్కడో ఓ వెలుగు దివ్వెను ఇలాకానుక చేస్తాయి
ఒక్క మంచిమనసు మండువేసవి వర్షమైనట్టు
నిష్కారణంగా మాటపడినా
నిప్పుతో కడిగినట్టు నిష్కామయోగులు
నిశ్శబ్ద రాగమై గుండెగంటను తడతారు
స్వప్నరాగలీలను సన్నగా మీటుతారు