STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

4  

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

సర్వ కాల ప్రియదర్శిని: కవీశ్వర్ :24 . 03 . 2022

సర్వ కాల ప్రియదర్శిని: కవీశ్వర్ :24 . 03 . 2022

1 min
274

సర్వ కాల ప్రియదర్శిని 

కవీశ్వర్ : రాజేంద్రనగర్ .24 . 03 . 2022

వచన కవితా సౌరభం : సర్వ కాల ప్రియదర్శిని 

ఒకప్పటి దూర శ్రవణంలో హలొ , హలొ అన్నాము

ఆ తర్వాత దూర సాంకేతికాసాధనంలో డాట్ - డాష్

ఆపైన సమాచారాన్ని దూర ముద్రితంలో ముద్రించాము

ఆ తర్వాత పెద్ద రేడియోలో కార్యక్రమాల సందడి వీనులారా విన్నాం 


తదుపరి ఆ మాటలని ముద్రించి మరలమరలా విన్నాం టేప్ రికార్డర్లల్లో 

వాటిని మనము చిత్రాలతో జతపర్చి నయనానందకరంగా చూస్తూండేవారం 

పెద్ద పెద్ద తెరలపైన, ఆపై , చిన్న చిన్న తెరలపై , బుల్లి, బుల్లి తెరలపై 

మరల మరల వేసుకుని చూస్తుంది వాళ్ళం వీడియో కాస్సెట్స్ రెకార్డర్లల్లో 


ఇప్పుడు కరకమలమ్ములలో ఇమిడి పోయే చరవాణులయందు ,

ఒళ్ళో పెట్టుకునే ప్రియదర్శిని ల యందు , మేజాబల్లపైని కంప్యూటర్లలో 

క్షణం తీరిక లేకుండగా చాటింగులు,సమాచార ప్రసారణలు, ఎల్లప్పుడూ

దృశ్య - శ్రావణ మాధ్యమాల లో నిత్యా క్రియలను (ట్రాన్సక్షన్స్ ) చేసుకునే 

నెటిజన్స్ , విజ్ఞాన సర్వస్వాలు మాధ్యమాలలో వెతికి వితరణలను చేసెదరేళ్లప్పుడు. 


వ్యాఖ్య : " ఈ రోజుల్లో సర్వ కార్యాలు ఇంటర్ - నెట్లల్లోనే జరుపు కుంటున్నారు ఏంతో సౌలభ్యంగా "

ఎలాంటి అవాంతరాలు రానంతవరకు " . 



Rate this content
Log in

Similar telugu poem from Action