"సంక్రాంతి పండుగ - కవితా పూరణం" : కవీశ్వర్ : 16 . 01 . 2022
"సంక్రాంతి పండుగ - కవితా పూరణం" : కవీశ్వర్ : 16 . 01 . 2022
"సంక్రాంతి పండుగ - కవితా పూరణం"
: కవీశ్వర్ : 16 . 01 . 2022
దత్త పాదం : "సంక్రాంతికినల్లుడొచ్చె సంపద తరిగెన్ "
పూరణం :
సంబరము కొఱకున్ దన పిల్లనిచ్చినమామన్
కొంగ్రొత్త పర్వ దినంబున కాహ్వానించెనదిన్
పిండివంటల, కానుకల నివ్వదలంచినన్
సంక్రాంతికి నల్లుడొచ్చె సంపద తరిగెన్
భావం : సంబరాలు జరుపుకోవడానికి తన పిల్లనిచ్చిన మామ
కొత్తదైనా పండుగకు ఆహ్వానించి , పిండి వంటలను , కానుకలను
ఇవ్వదలచినట్టి ఆ సంక్రాంతి పండుగకుసంపద తరిగిపోవున్నట్లు
అల్లుడొచ్చాడని ఈ పద్య పాదము యొక్క భావం .
వ్యాఖ్య : " ఈ సంక్రాతి పండుగకు అల్లుడిని ఆహ్వానించిన మధ్యతరగతి మామ గారు పండుగను జరుపుకొను విధము ఇలా ఉంటుందని నా అభిప్రాయం ."
హామీ పత్రం : ఈ కవితా పూరణం నా స్వీయ రచన . ఎవరి అనుకరణ కానీ , అనుసరణ కానీ కాదు.
