సమాధి ప్రేమ గీతం
సమాధి ప్రేమ గీతం
చీకటిని పారదోలే వెలుగువై వస్తావనుకొని
నా పెదవులపై చిరునవ్వై పూస్తావనుకొని
నా కళ్లలో కాంతివై మెరుస్తావనుకొని
దారులు కాస్తూ, పువ్వులను కోస్తూ
కొంగులో వేసుకుంటూ
పుష్పగుచ్చాలు పేర్చుతూ
నీ రాకకై ఎదురుచుస్తూ....
వ్యధ శిలాగా మారినా
నీ చిరునవ్వుల చిరునామా
కులం కత్తికి నీ మెత్తని హృదయం
రక్తం చిందించి ముక్కలుగా తెగిపడి
మన ప్రేమకు సాక్ష్యంగా మొలిచింది
ఇపుడు నీవు లేవని..
నదిని విడిచే అలను నేనై...
నింగి నోదిలే వెన్నెల కాంతినై...
ఎగసి పడే కెరటం నేనై...
రాత్రిని కప్పిన చీకటి నేనై...
కళ్ళను వీడే కలను నేనై...
స్వప్నాలలో విహరిస్తూ
ఉహాలల్లో ఊహిస్తూ
నీ కోసమే అన్వేషిస్తూ.....
పాలరాతి గోడలలో
నీవిచ్చిన జ్ఞాపకాలను
గుర్తు చేసుకుంటూ....
ప్రేమ సమాదుల నుండి
ప్రణయ గీతాల మాధుర్యాన్ని వింటు.....
భారంగా ఊపిరి తీసుకుంటున్న
నా గుండెను అడిగి చూసా...
నాలో నీ వెక్కడ దాక్కున్నావో వెతకమని
గుండెల్లో ఉంటూ నన్ను గాయపరచకు
నా మనసులో మౌనంగా ఉండి నన్ను ఏడిపించకు
నాలో నీవు పదిలంగానే ఉన్నావు.....కదా?
ఓ మౌనమా!.........బదులియ్యవా!...
నిన్న నన్ను వదిలి వెళ్లావు
నేడు నన్ను నేను వదిలి
నీలో నేను, నాలో నీవు
మన ఇద్దరి శ్వాస ఒక్కటే అని
ముగింపు పలుకుతూ
ప్రేమ కావ్యంగా నిలిచిపోతా....
ఇక సమాజ కర్కశ హృదయానికి సెలవు!
