సింధుర్
సింధుర్
విశ్వప్రేమ మధువుగాక..ఇంకేదో పంచలేను..!
విశ్వశాంతి సుధగ గాక..ఏతీరుగ పొంగలేను..!
ఒక రక్తపుబొట్టు నేల తాకిందా బాధెంతో..
పాఠమేదొ ఎవ్వరికో..ఏవేళా చెప్పలేను..!
దేశమేదొ మతమేదో..యుద్ధాలస లెందుకటా..
మానవతయె దైవత్వం..విజ్ఞతనే పెంచలేను..!
ప్రతి జీవీ తోబుట్టువు..చంపుకుతిను వేడుకేల..
అజ్ఞానపు వెన్నెలనిక..ఏమాత్రం ఓపలేను..!
సరిహద్దులు ఉండవచ్చు..ఇంటికి గడపలు లేవా..?!
అసూయలో ద్వేషాలో..మోస్తుంటే చూడలేను..!
ఇది మాయానాటకమని..ఏంచెప్పను ఎవరికైన..
శ్వాసపట్ల ధ్యాసనిలుప..సాయమేమి చేయలేను..!
