నందమూరి తారక రామ : వచన కవితా సౌరభం : కవీశ్వర్ : 30 . 03 2022
నందమూరి తారక రామ : వచన కవితా సౌరభం : కవీశ్వర్ : 30 . 03 2022
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
నందమూరి తారక రామారావు గారి వ్యక్తిత్వం - కవితల పోటీ
విశ్వ విఖ్యాత నటసార్వభౌమ : నందమూరి తారక రామ :
వచన కవితా సౌరభం : కవీశ్వర్ : 30 . 03 2022
అందరివలనే జీవితం లో కష్టాల కడలి నందు ఈది
ఒక్కొక్క విభాగాన నైపుణ్యాన్ని సమర్థ వంతముగా పొంది
బహుముఖ ప్రజ్ఞా శాలిగా సినీ,రాజకీయ రంగాల్లో వెలుగొంది
మార్గదర్శిగా ఆయారంగాలఎందరికో భారత రత్నం వెలుగు చూపింది
నాయక , ప్రతినాయక పాత్రలందు జీవించి నటించిన అనుకరణకు దారిచూపే
పౌరాణిక , ఇతిహాస పాత్రలిలా ఉండాలని , ఆహార్యం హావభావ తనదైనస్ఫూరద్రూపే
దర్శకత్వ , బాధ్యతలను సినిమా,రాజకీయ రంగాల్లోనైపుణ్యముతో వెలుగొందే సవ్యసాచే
తన నటనతో ఇతర కళాకారులను జీవితాన జీవింప జేసిన పరోపకారి ఆత్మగౌరవ స్వావచే
ఒక రామునిగా , కృష్ణునిగా , రావణునిగా, బ్రహ్మనాయ
ునిగా తలచిన తారక రాముని రూపమే
ఒక యుగపురుషునిగా,అడవి రామునిగా,న్యాయవాదిగానటనాచాతుర్యానికి ఉండే స్వరూపమే
నటన, నాట్యము ద్వారా, గాయక సంగీత దర్శకుల నైపుణ్యము స్ఫూరణకే వచ్చే మహద్రూపమే
ఏడు కోట్ల తెలుగువారి వెండితెర వేల్పు,ఎంతో మంది జీవన ప్రదాత నందమూరి నిత్య స్మరణమే
వ్యాఖ్య : " ఈ నటనా యుగ పురుషునికి, రాజకీయ దురంధరుని ఉనికి , సంస్కరణ , మార్గదర్శిత్వం ,ప్రపంచ రికార్డును సృష్టించిన ఈ విశ్వా విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామా రావు గారికి ఇంకా భారత రత్న రాకపోవడం విచారించ దగిన అంశం ఆతనికి, బాలు గారికి ఆ భారత రత్నాలను ఇచ్చి యావద్భారత దేశం వారిని సంస్మరించు కుంటే చాలా బాగుంటుంది. ఈ శుభకృత్ సంవత్సర శుభాగమనా సందర్భంలో నైనా ఈ ప్రక్రియ పూర్తి అయితే చాలా బాగుంటుంది."
కవీశ్వర్ :