నా పేరు ఉత్తర ప్రదేశ్
నా పేరు ఉత్తర ప్రదేశ్
నా పేరు ఉత్తర ప్రదేశ్
నా రాజధాని లక్నో.
నా అధికార భాషలు హిందీ, ఉర్దూ, ఆంగ్లం,
నా నృత్యం కథక్ కి జన్మస్థలం
నేను గంగా యమునా మైదానల్లో విస్తరించి ఉన్నాను.
నేను అత్యధిక జనాభా గల అతి పెద్ద రాష్ట్రాన్ని
నేను వైశాల్యం ప్రకారం 5 వ పెద్ద రాష్ట్రము.
నా ముఖ్యమైన నగరాలు- ఆగ్రా, అలీగఢ్,
అయోధ్య, వారాణసి, గోరఖపూర్, కాన్పూర్
నా ప్రధాన న్యాయస్థానం అలహాబాదులో ఉంది.
నా నుండి 2000 సంవత్సరంలో 'ఉత్తరాంచల్' ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది.
నాకు 'నేపాల్తో' అంతర్జాతీయ సరిహద్దు ఉంది.
నా వన్యప్రాణులు, అరణ్యాలు -
రాయ్ బరేలిలోని సమస్ పూర్ పక్షి సంరక్షణ కేంద్రం, చంబల్ వన్యప్రాణి అభయారణ్యం,
దుధ్వ జాతీయ పార్కు వంటివి
నా చేతివృత్తులు-చేతి ముద్రణ, కార్పెట్ తయారీ, లోహపు పూత, బంగారు జలతారు పని, ఇత్తడి, నల్లచేవమాను పని మరియు ఎంబ్రాయిడరి
పర్యాటక ప్రాంతాలు -తాజ్ మహల్
తాజ్ మహల్ 1983వ సంవత్సరంలో తాజ్ మహల్‌ను యునెస్కో ప్రపంచ పూర్వ సంస్కృతి ప్రదేశంగా మార్చింది., "భారత దేశంలో ఉన్న ముస్లిం కళ ఆభరణంగా ఉదాహరించింది.
తాజ్ మహల్, ఆగ్రకోట, ప్రేమ బృందావనం,
కౌషాంబి, వారణాసి, కుషినగర్, చిత్రకూట్, లక్నో, ఝాన్సీ, మీరట్, అలహాబాద్ , మధుర
అక్బర్ నిర్మించిన ఫతేపూర్ సిక్రీ, ప్రతాప్ గడ్, బారాబంకి, జౌన్ పూర్, మహోబా
నా ఘనత: ప్రపంచ 9 వింతలలో ఒకటి తాజ్ మాహల్ బుద్ధుడు తన మొదటి ప్రవచనాలు పలికింది సారనాథ్ లోనే. బుద్ధుడి భౌతిక దేహాన్ని పరిత్యజించిన కుషినగరం, ప్రభాస్ గిరి హిందువులకు, జైనులకు ఇద్దరికీ కూదా పవిత్రమైన నేల,
నా పుణ్యక్షేత్రాలు-
హిందువులకు పవిత్ర పుణ్యక్షేత్రమైన వారణాశి (కాశి) శ్రీకృష్ణుని జన్మస్థానం మథుర,
శ్రీరాముని జన్మస్థానం అయోధ్య
బృందావనం, గోవర్ధన గిరి
శ్రీరాముడు, సీతాదేవి దంపతుల కుమారులు లవకుశులు జన్మించిన స్థలం బితూర్.
మహాభక్తులైన కబీర్, తులసీదాస్, సూరదాస్ ల జన్మస్థానం
నా త్రివేణి సంగమం-
నా మూడు ప్రధాన నదులు గంగ, యమున, సరస్వతి సంగమించిన ప్రదేశం అలహాబాద్. ఈ నగరం అతి పురాతనమైన నగరం.
ప్రపంచం నలుమూలల నుండి ఆధ్యాత్మిక, ధార్మిక పర్యాటకుల "కుంభమేళా" జరిగే ప్రదేశం
