నా పేరు తెలంగాణ
నా పేరు తెలంగాణ
నా పేరు తెలంగాణ
నేను అవతరించింది 2014 జూన్ 2 న
నేను కొత్త రాష్ట్రంగా అవతరించాను
నా రాజధాని హైదరాబాద్
నా గీతం "జయహే జయ తెలంగాణ జనని జయకేతనం"
నా అధికారిక భాషలు తెలుగు
(ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్), ఉర్దూ,
నా చిహ్నం కాకతీయ కళా తోరణం, చార్మినారు
నా జంతువు దుప్పి (జింక)
నా పక్షి పాలపిట్ట
నా పుష్పం తంగేడు పువ్వు
నా ఫలం మామిడి
నా వృక్షం జమ్మి చెట్టు
నా చేప కొర్రమట్ట
నా క్రీడ కబడ్డీ
నా నదులు
గోదావరి, కృష్ణా, మంజీరా, మూసీ నదులు
నా అధికారిక పండుగలు బోనాలు, బతుకమ్మ
నేను శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం ఈ మూడు దేవాలయాల మద్య ఉంటాను కాబట్టి కాకతీయులు పాలించిన ప్రాంతం త్రిలింగ దేశమే కాలగమనంలో "తెలంగాణ"గా మారాను.
నా విశ్వ విద్యాలయాలు ఉస్మానియా , వరంగల్ జాతీయ సాంకేతిక నిట్, ఆచార్య ఏన్.జి.రంగా విద్యాలయం, జె ఎన్. టీ.యు, కాకతీయ విశ్వవిద్యాలయం,
నా ప్రాజెక్టులు నాగార్జునసాగర్ , ప్రియదర్శిని జూరాల, శ్రీరాంసాగర్, అలీసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టు, కుంత(ట)ల జలపాతం, పొచ్చెర జలపాతం, భోగత జలపాతం, నిజామాబాద్ లో కందకుర్తి త్రివేణి సంగమం
నా పర్యాటక ప్రాంతాలు
హైదరాబాదులో రామోజీ పిల్మ్ సిటి, బిర్లామందిరం, బిర్లా ప్లానెటోరియం, చార్మినార్, నెహ్రూ జూపార్క్, సాలార్జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్, లుంబినీ పార్క్, ఎన్టీయార్ గార్డెన్, సర్దార్ మహల్, ఖమ్మం జిల్లాలో రామాయణం కాలం నాటి పర్ణశాల, పాపికొండలు, కిన్నెరసాని అభయారణ్యం, నేలకొండపల్లి బౌద్ధస్తూపం, పాలమూరు జిల్లాలో పిల్లలమర్రి వృక్షం,
నా చారిత్రక సాంస్కృతిక ప్రదేశాలు:
వెయ్యి స్తంభాల గుడి, ఓరుగల్లు కోట
నిజామాబాద్ సారంగపూర్ హనుమాన్ మందిరం
(శివాజి గురువైన సమర్థ రామదాసు నిర్మించినది)
నిజామాబాద్ ఖిల్లారఘునాధ ఆలయం
(శివాజి గురువైన సమర్థ రామదాసు నిర్మించినది)
డిచ్ పల్లి ఖిల్లా రామాలయం,
కొల్చారంలో జైనమందిరం,
జైనాథ్‌లో పల్లవుల కాలం నాటి ఆలయం, గంగాపూర్‌లో కళ్యాణి చాళుక్యుల కాలం నాటి చెన్నకేశ్వస్వామి ఆలయం,
బీచుపల్లిలో పురాతనమైన
ఆంజనేయస్వామి ఆలయం
మెదక్‌లో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పెద్ద చర్చి,
మేడారంలో సమ్మక్క-సారక్క గద్దె
నా కోటలు చారిత్రక సౌధాలు:
గోల్కొండ కోట,గద్వాల కోట, ఖిల్లాఘనపురం కోట, అంకాళమ్మ కోట, కోయిలకొండ కోట, పానగల్ కోట, భువనగిరి కోట, దేవరకొండ దుర్గం, దోమకొండ కోట,ఖమ్మం ఖిల్లా, జగిత్యాల ఖిల్లా, ఎలగందల్, రామగిరిఖిల్లా, మెదక్ ఖిల్లా
నా అధ్యాత్మిక ప్రదేశాలు:
ఆలంపూర్ అష్టాదశ శక్తి పీఠం
బాసరలో జ్ఞానసరస్వతి దేవాలయం,
భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం, యాదగిరి గుట్టలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, వేములవాడలో శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం, నిజమాబాద్ లో నీలకంఠేశ్వర స్వామి
కొండగట్టులో ఆంజనేయస్వామి ఆలయం, కాళేశ్వరంలో కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం, అచ్చంపేట సమీపంలో ఉమామహేశ్వర ఆలయం, నారాయణపేట సమీపంలో ఔదుంబరేశ్వరాలయం, సిర్సనగండ్లలో సీతారామాలయం,
మన్యంకొండలో శ్రీవెంకటేశ్వరాలయం,
మామిళ్ళపల్లిలో నృసింహక్షేత్రం,
ఏడుపాయలలో భావాని మందిరం,
బొంతపల్లిలో వీరభద్ర, భద్రకాళి ఆలయం,
లింబాద్రిగుట్టపై లక్ష్మీనృసింహస్వామి
బోధన్ ఏకచక్రేశ్వర ఆలయం,
తాండూరులో భద్రేశ్వరస్వామి ఆలయం,
అనంతగిరిలో పద్మనాభస్వామి ఆలయం,
కీసరలో రామలింగేశ్వరస్వామి ఆలయం,
చేవెళ్ళలో వెంకటేశ్వరస్వామి ఆలయం,
చిలుకూరులో బాలాజీ ఆలయం,
పాంబండలో రామాయణం కాలం నాటి శివాలయం, దామగుండంలో రామలింగేశ్వరాలయం,
పాలంపేటలో రామప్పదేవాలయం,
కొమురవెల్లిలో మల్లికార్జునస్వామి ఆలయం...
గమనిక: ముఖచిత్రం నందు గల భారతదేశ పటంలో 24 వ నెంబర్ చూపించే ప్రాంతం ఈ రాష్ట్రం. అట్టి ఇండియన్ మ్యాప్ Google వారి సౌజన్యంతో public domain నుండి స్వీకరించడం జరిగినది.
(స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేసిన తెలంగాణ సిద్దాంతకర్త ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి (06.08.1934) సందర్భంగా ఘన నివాళులు )
