నా పేరు మధ్య ప్రదేశ్
నా పేరు మధ్య ప్రదేశ్
నా పేరు మధ్య ప్రదేశ్
నేను పేరుకు తగినట్లే భారతదేశం మధ్యలో ఉంటాను.
నా రాజధాని నగరం భోపాల్.
నా అవతరణ 1956 నవంబర్ 1లో
నా నుండి 2000 నవంబరు 1 న కొన్నిభాగాలను వేరుచేసి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు.
నా అధికార భాష హిందీ
నా సరిహద్దులు
తూర్పున ఛత్తీస్‌గఢ్,
ఈశాన్యాన ఉత్తర ప్రదేశ్,
పశ్చిమాన గుజరాత్
వాయువ్యాన రాజస్థాన్,
దక్షిణాన మహారాష్ట్రలతో హద్దులున్నాయి.
నా మూడు స్థలాలు ప్రపంచ వారసత్వ స్థలాలుగా ఐక్యరాజ్యసమితి విద్యా సాంస్కృతి సంస్థ (UNESCO) చే గుర్తింపబడ్డాయి. అవి
ఖజురాహో మందిరాలు (1986)
సాంచి బౌద్ధారామాలు (1989)
భింబెటక శిలావాసాలు (2003)
నా చారిత్రిక నిర్మాణాలు సహజసౌందర్యానికి, అద్భుతమైన నిర్మాణాలకు ప్రసిద్ధి చెందిన పట్టణాలు
అజయ్‌ఘర్,అసిర్‌ఘర్,భోపాల్,ధార్,గ్వాలియర్,
ఇండోర్, మహేశ్వర్, మండూ, ఓర్చా, పంచమర్హీ
శివపురి, ఉజ్జయిని
నా జాతీయ ఉద్యానవనాలు (National Parks)
బాంధవ్‌గఢ్ జాతీయ ఉద్యానవనం
కన్హా జాతీయ ఉద్యానవనం
సాత్పురా జాతీయ ఉద్యానవనం
సంజయ్ జాతీయ ఉద్యానవనం
మాధవ్ జాతీయ ఉద్యానవనం
వనవిహార్ జాతీయ ఉద్యానవనం
ఫాస్సిల్ జాతీయ ఉద్యానవనం
పన్నా జాతీయ ఉద్యానవనం
పెంచ్ జాతీయ ఉద్యానవనం
