నా పేరు అసోం
నా పేరు అసోం
నా పేరు అసోం (ఇదివరకటి పేరు అస్సాం)
నా రాజధాని దిస్పూర్
నా ఆకారం ఆంగ్ల అక్షరం T లాగా ఉంటాను
నా అధికార బాషలు అస్సామీస్, బోడో, కర్బీ
నా పండుగలు బిహు, దుర్గా పూజ,
నా ప్రధాన వృత్తి ప్రధాన వ్యవసాయమయిన
తేయాకుకు ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. కామెల్లియా అస్సామికా Camellia assamica అనేది అస్సాము పేరుతో ప్రసిద్ధమైన ఒక తేయాకు రకం.
నా పర్యాటక ఆకర్షణ కజిరంగా నేషనల్ పార్క్ , ఇది అరుదైన గ్రేట్ ఇండియన్ వన్-హార్న్డ్ ఖడ్గమృగం చూడవచ్చు
ప్రపంచపు అతి పెద్ద ద్వీపం మజులి ద్వీపం
నా సంగీతకారులలో రుద్ర బారువా, భూపేన్ హజారికా, ఖాగెన్ మహంత ప్రసిద్ధులు
నా వాణిజ్య నగరమైన గౌహాతి సప్త సోదరీ రాష్ట్రాలుగా పిలవబడే ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారము.
నాకు ఆచార వ్యవహారాలలో ఇష్టమైనవి 'గమోసా'
ఇది ఒక దీర్ఘ చతురస్రాకారపు గుడ్డ. మూడు ప్రక్కల ఎరుపుగాని, వేరే రంగులో గాని అంచు ఉంటుంది. నాలుగవ ప్రక్క అల్లిక అంచుగా ఉంటుంది. దీనిని వళ్ళు తుడుచుకోవడానికి మొలకు కట్టుకోవడానికి, 'బిహూ నాట్యకారులు' చిత్రమైన ముడివేసి తలగుడ్డగా వాడుతారు. ప్రార్థనా సమయంలో మెడలో వేసుకొంటారు.
గమనిక: ముఖచిత్రం నందు గల భారతదేశ పటంలో 3 వ నెంబర్ చూపించే ప్రాంతం ఈ రాష్ట్రం. అట్టి ఇండియన్ మ్యాప్ Google వారి సౌజన్యంతో public domain నుండి స్వీకరించడం జరిగినది
