నా పేరు ఆంధ్రప్రదేశ్
నా పేరు ఆంధ్రప్రదేశ్
నా పేరు ఆంధ్రప్రదేశ్
నేను అవతరించింది 1956 నవంబరు 1న
నా రాజధాని అమరావతి
నా నినాదం "సత్యమేవ జయతే"
నా గీతం "మా తెలుగు తల్లికి మల్లె పూదండ"
నా భాష తెలుగు(ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్)
నా నృత్యం కూచిపూడి
నా జంతువు కృష్ణ జింక
నా పక్షి రామచిలుక
నా చేప డాల్ఫిన్
నా పుష్పం మల్లె పువ్వు
నా వృక్షం వేప చెట్టు
నా క్రీడ చెడుగుడు ఆట
నా పర్యాటక స్థలాలు:
ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే
పుణ్యక్షేత్రాలలో ఒకటైన తిరుమల
శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం నాదే
పంచారామ క్షేత్రాలు, శ్రీశైల క్షేత్రం,
కోదండ రామాలయం నా పుణ్యక్షేత్రాలు
అమరావతి ధ్యాన బుద్ధ విగ్రహం, బౌద్ధ చైత్యాలు, స్తూపాలు, లేపాక్షి నంది, పాపి కొండలు, హార్స్‌లీ కొండలు అరకులోయలు, విశాఖపట్నం తీరం,
కోనసీమ డెల్టాలు నా సహజ ఆకర్షణలు
నా నదులు: కృష్ణ, గోదావరిలు నా నుండి ప్రవహిస్తు లక్షల హెక్టార్ల భూమి సాగు చేస్తూ
నా పేరు ఆంధ్రప్రదేశ్ ను అన్నపూర్ణగా పెరుతెచ్చినవి
నాకు భౌగోళిక గుర్తింపులు:
బనగానపల్లె మామిడి, బందర్ లడ్డూలు, బొబ్బిలి వీణ, ఇత్తడి హస్తకళలు, గుంటూరు సన్నం, కొండపల్లి బొమ్మలు, మచిలీపట్నం కలంకారి, శ్రీకాళహస్తి కలంకారీ, వెంకటగిరి, మంగళగిరి చీరలు,ధర్మవరం చేనేత పట్టుచీరలు, పావడాలు,కొండపల్లి కొయ్య బొమ్మలకు పేరుపొందింది
నా ఘనత:
నేను ఈ దేశ విస్తీర్ణంలో ఎనిమిదవ అతిపెద్ద రాష్ట్రన్ని.
నాకు దేశంలో రెండవ పొడవైన తీరప్రాంతం నాదే
నేను 'కోహినూర్' ప్రపంచ ప్రఖ్యాత వజ్రాల గనిని
నా కాకినాడ నుండి భారత ప్రామాణిక రేఖాంశమైన 82°30' తూర్పు రేఖాంశం పోతుంది
అంతరిక్ష పరిశోధన:
నా శ్రీహరికోట భారత అంతరిక్ష పరిశోధనకు
ఉపగ్రహ ప్రయోగ కేంద్రం
గమనిక: ముఖచిత్రం నందు గల భారతదేశ పటంలో 1 వ నెంబర్ చూపించే ప్రాంతం ఈ రాష్ట్రం. అట్టి ఇండియన్ మ్యాప్ Google వారి సౌజన్యంతో public domain నుండి స్వీకరించడం జరిగినది
