Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

SATYA PAVAN GANDHAM

Abstract Tragedy Inspirational

4  

SATYA PAVAN GANDHAM

Abstract Tragedy Inspirational

"మతోన్మాదం"

"మతోన్మాదం"

2 mins
566


మతం... మతం... మతమంటూ...!
కన్నబిడ్డ లాంటోల్లే కొట్టుకు చచ్చేలా పోరాటపడుతుంటే?
కనిపించని ఆ అస్తిరాస్తి కొరకై ఆరాటపడుతుంటే?
నెత్తురోడిన ఆ పుడమి తల్లి రోదన నీకు వినబడుతుందా?
సత్తువోడిన ఆ గగనపు వేదన నీకు కనబడుతుందా?

మేమధికులం... మేమధికులం... మేమధికులమంటూ...!
ఎవరెవరో వచ్చి, ఏదేదో చెప్పి, పరమతమే శరణ్యమంటే,
విర్రవీగీ వేరుపడిన వెర్రి దేశాలు ఏమయ్యాయి?
ఉగ్రవాధమనే ముసుగులో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతుంటే,
ఆ శరణార్థుల ఆర్తనాధాలకు కారకులెవరు?

మతతత్వం... మతతత్వం... మతతత్వమంటూ...!
సామాన్యుడి నమ్మకాన్ని సొమ్ముచేసుకుని అమ్ముకుంటుంటే,
ఆ అతీతశక్తుల అన్యాయానికి అడ్డేది?
దుర్మార్గపు దుష్టశక్తుల దురాఘతాలతో లోకం అట్టుడుకుతుంటుంటే,
మానవాళి మృత్యుఘోషకి ఇక అంతమెక్కడ?

మనం... మనం... మనమంటూ...!
పాలించే పాలకులే కులమతమని కుంపటి పెడుతుంటే,
ఆ నియంతృత్వ పరిపాలనపై పెదవి విరవలేవా?
హింసాకాండతో చెలరేగుతూ మారణకాండను సృష్టిస్తుంటే,
ఆ రాక్షస రాజ్యంపై రంకెలేయలేవా?

స్వేచ్ఛ... స్వేచ్ఛ... స్వేచ్ఛంటూ...!
ఆనాడు స్వాతంత్ర్యాన్ని సాధించిందెందుకు?
మా నేల, మా దేశమని ప్రగల్భాలు పలికిందెందుకు?
నీ సిద్ధాంతాన్ని రాద్ధాంతం చేసుకుంటూ పడి దొర్లెందుకేనా?
నీ ఆవేశానికి ఆజ్యం పోస్తూ ఎగిరెగిరి పడేందుకేనా?

జ్ఞానం... జ్ఞానం... జ్ఞానమంటూ...!
నువు పఠించిన విజ్ఞానం అంతరించిందా ?
భిన్నత్వంలో ఏకత్వమనే నినాదం కనుమరుగైందా?
కలిసికట్టుగా ఉండాల్సిన ఈ సమాజమెటుపోతుందో?
ఒక్కటిగా ఏకమవాల్సిన నా దేశమేమవుతుందో?

బిక్కు... బిక్కు... బిక్కుమంటూ...!
సన్నగిల్లిన సగటు మానవుడి అవివేకపు ఆలోచనలతో,
అనుక్షణం భయం గుప్పిట్లో దాక్కుంటున్న ప్రజానికం!
సిరాలా కలాలు కక్కుతున్న ఆవేదనపు అలజడితో,
ప్రతిక్షణం బాధా తప్త హృదయాలతో విసుగు చెందిన మా కవితా లోకం!!

మేలుకో...! మేలుకో...! ఓ మిత్రమా...!!
మతమనే చీకటి తెరలను చీల్చుతూ,
గతమనే మబ్బు పొరలను వీడుతూ,
మసకబారిన నీ జీవితపు వాకిట్లో
వెలుగును పంచే ఓ కాంతి కిరణం లా...

సాగిపో...! సాగిపో...! ఓ సహోదరా...!!
నీ హక్కును హారించే వాళ్ళను కండిస్తూ,
నీ దిక్కును ఏమార్చే వాళ్ళను దండిస్తూ,
నీకై పరచుకున్న దారిలో
గమ్యాన్ని చేరే ఓ అలుపెరగని బాటసారిలా...

ఎగిరిపో...! ఎగిరిపో...! ఓ బ్రతుకుజీవుడా...!!
నీ సరిహద్దుల గీతలను దాటుకుంటూ,
ఆ బానిస సంకెళ్లను తెంచుకుంటూ,
నీకై వేచివున్న స్వేచ్ఛా లోకంలో
విహరించే ఓ రెక్కలు విచ్చుకున్న విహంగంలా...

ఈ రచనతో నివురుగప్పిన నీ మదికి,
కాదా...?
నే అమర్చిన ప్రతీ అక్షరం!
లక్ష్యం పైపు నువు ఎక్కుపెట్టబోయే విల్లుకు "ఓ బాణం..."

కాదా...?
నే పేర్చిన ప్రతీ పదం!
గమ్యం వైపు నువు వేయబోయే అడుగుకు "ఓ సోపానం..."

కాదా...?
నే కూర్చిన ప్రతీ వాక్యం!
సంగ్రామంలో నువు పురికోల్పబోయే యుద్ధానికి "ఓ సారధి..."

కాదా...?
నే చేర్చిన ఈ కావ్యం!
మనిరువురి ఆలోచనలను ఏకతాటిపై నిలపగలిగే "ఓ వారధి..."

రచన : సత్య పవన్ ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu poem from Abstract