STORYMIRROR

VENKATALAKSHMI N

Abstract Tragedy Fantasy

3  

VENKATALAKSHMI N

Abstract Tragedy Fantasy

మొరటుదనం

మొరటుదనం

1 min
180


ఊసుపోని నేను

పచ్చని చెట్టు కింద

కూర్చుని

లేత ఆకుల అందాలను

అందులోని పచ్చదనాన్ని

చూస్తూ ఉండలేక

చివురులను చిదిమేశాను

చెంపలను తడిమాను

మల్లె తీగ పరిమళం

నను రమ్మని సైగ చేస్తే ను

పసిమొగ్గలను గోటి కొసలతో

కసిగా గిల్లాను

విచ్చుకోకుండానే నేలరాలాయి

స్వేచ్ఛ గా ఎగిరే సీతాకోక చిలుక ను

మొరటు వేళ్ళతో గట్టిగ పట్టి

తనివితీరా తడిమి పరవశించాను

తూనీగ రెక్కలు సైతం విరిచాను

చిటారు కొమ్మన చిలుకను

నా ఆనందానికయి

పంజరంలో పెట్టాను

నేనూ ప్రకృతి లో చిలకేనని మరిచాను


Rate this content
Log in

Similar telugu poem from Abstract