STORYMIRROR

ARJUNAIAH NARRA

Abstract Inspirational Children

4  

ARJUNAIAH NARRA

Abstract Inspirational Children

మోడ్రన్ స్త్రీ

మోడ్రన్ స్త్రీ

1 min
456

నేను.......

ఒక పాపని......

ఒక బాలికను.....

ఒక యౌవనవతిని.....

ఒక స్త్రీని........

ఒక ఇల్లాలిని........

ఒక అమ్మని.....అయితే

ఒక తల్లిగా ఈ ప్రపంచమే నాది.....


నన్ను నన్నుగా ఏనాడు చూడలేదు

నేను పుట్టడమే పాపం అనుకున్నావు

పురిటీలోనే కళ్ళుతెరువకముందే 

నా కళ్ళు మూసేస్తున్నావు

నన్ను బాలికగా ఉన్నప్పుడే బలవంతం చేశావు

ఒక యౌవ్వనవతిగా ఉన్నప్పుడే గర్బవతిని చేశావు

ఒక ఇల్లాలిగా ఉన్నప్పుడు బాదించావు

ఒక అమ్మగా ఉన్నప్పుడు 

అనాధ ఆశ్రమంలో పెట్టేశావు...


నన్ను బాలహీనురాలు అన్నావు

నేను భరించాను

బహుశా నా బలం బలహీనతలు అన్ని నీవే

నాకు చదువు లేకుండా చేసి 

నన్ను అమాయకురాలిని అన్నావు

అయినా నీవు చదువుకుంటే అదే చాలు అనుకున్నాను

నీకు పిల్లలను కనడమే తెలుసు

పరిపాలించడం రాదు అన్నావు

నిన్ను రాజుగా చూడటమే లక్ష్యంగా ఉన్నాను


కానీ ఇపుడు నేను చదువుతున్నాను

నేను ఆకాశ జ్ఞానాన్ని అందుకున్నాను

అవని యందు అన్ని రంగాలలో

అభివృద్ధి పథంలో ప్రయాణిస్తున్నాను


కానీ ఇపుడు నీవు అనుకుంటున్నట్లు.....

నేను బట్టలు ఉతికే వాషింగ్ మెషిన్ ని కాదు

అన్నాన్ని వండిపెట్టే కుక్కర్ ని కాదు

బూజును దులిపే చీపురుని కాదు

అంట్లు తోమే అంట్ల సబ్బును కాను

నేను పిల్లలను కనే యంత్రాన్ని కానే కాను


నాకు కొరికలున్నాయి, తీర్చుకోవాలి

నాకు ఆలోచనలున్నాయి, అమలుచెయ్యాలి

నాకు ఆశయాలున్నాయి, సాధించుకోవాలి

నా చుట్టు ఆచారాల వల వేయకు

సంప్రదాయాలంటూ ఉచ్చును బిగించకు


నేను తెగిస్తే అనాదిగా

నీవు కట్టుకున్న ఆచారాలు

అగ్నిలో దహించిపోతాయి

నీవు పాటిస్తున్న సంప్రదాయాలు 

సముద్రంలో కొట్టుకుపోతాయి


అణచి వేయాలని చూడకు

నా ఆత్మ గౌరవం కోసం

నిన్ను కోర్టు మెట్లు ఎక్కిస్తాను

ఏడడుగులు వేసిన దాన్ని

ఎనిమిదో అడుగు వేసి

ఏడు సువ్వలను లెక్కపెట్టిస్తాను


నాతో యుద్ధం చేయవద్దు

నేనేమి సైనికురాలిని కాదు

నన్ను హింసించవద్దు 

నేనేమి నీ బానిసను కాను


నన్ను పసిపాపగ జన్మించనివ్వు

బాలికగా ఎదగనివ్వు

యవ్వన వతిగా ఉండనివ్వు

ఇల్లాలిగా ప్రేమను పంచనివ్వు

అమ్మగా ఈ ప్రపంచాన్ని లాలించనివ్వు



Rate this content
Log in

Similar telugu poem from Abstract