STORYMIRROR

VENKATALAKSHMI N

Abstract Tragedy Others

4  

VENKATALAKSHMI N

Abstract Tragedy Others

మాసిన గతం

మాసిన గతం

1 min
343

ఎగిరి పడిన బతుకు

నేలకొరిగిన క్షణం 

పగిలిన గాజు ముక్కలా

విరిగిన మనసులా 

చెదిరిన చెలిమి లా

 గుండెను పిండిన 

కడుపు మండిన 

గాయం హేయమై 

మనసును దహిస్తున్నప్పుడు

తలచి తలచి

వగచి వగచి 

విలపించుటం మాని

నిన్ను నీవు 

నీతో నీవు 

నీలో నీవే 

ఓదార్పు తీరం 

చేరే మార్గం అన్వేషించు 

మాసిన గతం 

చేసిన గాయం కు 

వీడ్కోలు పలికి 

సుమ గంధాల 

పూతోట కై బాటనుపరుచు

నీ మనసే నీ తోడు 

నీ ఆశే నీవు ఊపిరి 

నీ గమ్యం సాగించు 

గమనం శోధించు 

విజయం వరించు 

తదుపరి తరచి చూడు 

ఆ ఆనందాల లాహిరి 

తప్పక ఆస్వాదించి చూడు 

పడిలేచిన ఆనంద ఝరీ

ఆత్మ తృప్తి తో ముగిసిన జీవనయాత్ర నిజమైన మనిషి గా 

నీకు నీవే రాసుకున్న నీ మరో చరిత్ర



Rate this content
Log in

Similar telugu poem from Abstract