STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Action Inspirational Children

4  

Jayanth Kumar Kaweeshwar

Action Inspirational Children

లాలిపాట :KAWEESHWAR 11.01.2022

లాలిపాట :KAWEESHWAR 11.01.2022

1 min
230

భారత్ కా అమృత్ మహోత్సవ్ లో లాలి పాట కొఱకు

కవీశ్వర్ : 11 .01 .2022

పల్లవి : ఓయమ్మా మాయమ్మ నిదుర పోవలెనే

       నిదురపోయి కమ్మని కలలు కనవలెనే 

      కలలుకని వాటినెప్పుడూ అమలుపెట్టవలెనే 

       అమలు పెట్టి నిష్ఠతో నీ లక్ష్యాన్ని చేరాలెనే || ఓయమ్మా ||

చరణం 1 : కతియ ముని లాలనలో కాత్యాయని దేవిగా

           భృగు మహర్షి పాలనలో భార్గవీ దేవిగా 

           మాతంగ మహర్షి పోషణలో మాతంగ కన్యగా 

           విష్ణు చిత్తుని పరిచర్యలలో గోదాదేవి గా || ఓయమ్మా ||

చరణం 2 : లాలిత్యం లో కోమలాంగివై ,సహనంలో సీతాదేవివై 

           భావనలో భావానీ దేవివై , చైతన్య స్ఫూర్తి వై నిలిచే 

          కార్యములలో క్రియారాణి,మంత్రగములో ఆమంత్రిణిగా

           వీర,రౌద్ర రసాలలోరుద్రమ,ఝాన్సీ రాణివై తేజరిల్లవలే || ఓయమ్మా ||

చరణం ౩ : కవనం లో మొల్లవై , నాట్యంలో రంభవై, గానంలో సుబ్బులక్ష్మివై

          చిత్రకారుల కుంచెకే అందానివై, శిల్పకారుల ఉలికే ప్రేరణవై

          గాంధర్వ గానానికి శ్రవణామృతవై , సాధికారతకే చిన్మయ మూర్తివై

          గతించినఘటనలస్మృతులచే,వర్తమానంలోభవిష్యఅభివృద్ధిలో నీవే || ఓయమ్మా||


వ్యాఖ్య : "మన జీవన గమనం లో స్త్రీ పాత్ర ఉన్నత భావాలతో ,ధర్మ బద్ధంగా సహా కర్మ చారిణిగా ఉన్నత మైన స్థితిలో ఉంచాలని , వారికి సముచిత గౌరవాన్ని ఇచ్చి ఆదరించవలె . వారిపట్ల అనుచిత ప్రవర్తన కూడదు అని నా అభిప్రాయం." 

హామీ : ఈ లాలిపాట నా స్వీయ రచన . ఎవరి అనుకరణ కానీ , అనుసరణ కానీ కాదు. : కవీశ్వర్ .


Rate this content
Log in

Similar telugu poem from Action