కరోనా.. ఎంత మహమ్మారి అయినా..
కరోనా.. ఎంత మహమ్మారి అయినా..


కరోనా.. కరోనా.. నీ పుట్టుక వుహను లోనా...!
మొదట నీ పై అందరికీ... ఉన్నది చిన్న చూపే అయినా ..!!
ఆ తరువాత.. అతలాకుతలమై అయ్యింది లే చైనా..!
ఆపై ఉలిక్కిపడేలా చేసింది నీ వార్త... యావత్ జగానా..!!
దారి తప్పి హద్దు,అదుపు.. లేకుండా పోయిన ఈ మానవాళి లోనా..!
ఈరోజు ఐక్యతతోనే సాధ్యం ఏదైనా... అని తెలుసుకుంది నీ వలన..!!
సంస్కారపు...సంసారపు... విలువలు నాటావు ప్రతి మదిలోన ...!
దేవుడు ఒకడు... చూస్తున్నాడని గుర్తు చేశావు నీ పుట్టుక తో నా....!!
భయం భయమై బయటికి పోవాలనా.. ఇంట్లో ఉండాలనా..!
యావత్ ప్రపంచమే.... నీ పై యుద్ధము ప్రకటించినా....!!
నీ ఉనికిని చాటుతునే ఉన్నావ్ గా... యుద్ధరంగానా...!
పోరాటపటిమను చాటుతూనే ఉన్నారు.. ఎన్నో ప్రాణాలు పోతునా..!!
కరోనా.. కరోనా.. నీ ఉనికి కొద్దికాలమే... ఏదిఏమైనా..!
తప్పదులే నీ అంతము డాక్టర్ల చేతిలో... నువ్వు ఎంత మహమ్మారిఅయినా,,!!