కాలం
కాలం
కాలం ఎవరి కోసం ఆగదు..
నువ్వు ఆగిన నీ జీవితం ఆగదు. నీ పరుగు ఆపదు.
గెలిచిన ఓడిన బ్రతుకు పోటీలో పాల్గొనాల్సిందే..
కాలం వెళుతూ వెళుతూ రెక్కలు కూడా తీసుకుపోయింది..
మనసు రెక్కలు తెగిన పక్షి అయిపోయింది..
నవ్వు, సంతోషం అనే పదాలను మార్చేసింది..
కాలం జీవితంలో చాలా నేర్పింది..
గతం ఎప్పుడూ గాయం చేస్తూ ఉంటుందని
బంధాలు ఎప్పుడూ బంధించేస్తాయని..
కాలం గుణపాఠం నేర్పింది..
ఏ బంధాన్ని అతిగా దగ్గరకు రానివ్వద్దని..
మనం ఎంత దగ్గరకు తెచ్చుకుంటే అంత దూరం అవుతుందని..
కాలం గొప్ప పాఠం చెపుతుంది..
కాళీ చేతులతో వచ్చి కాళీ చేతులతో పోతామని..
