STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Tragedy Action Crime

4  

Thorlapati Raju(రాజ్)

Tragedy Action Crime

GOVT business..

GOVT business..

1 min
399


విధానాలు.పోయి విలీనాలొచ్చెన్

విలువలు పోయి విపరీతాలొచ్చెన్

నమ్మకాలు పోయి అమ్మకాలొచ్చెన్

వ్యాపారస్తులు పోయి..

ప్రభుత్వాలే పరకాయ ప్రవేశం చేసెన్!


వచ్చెన్.. వచ్చేన్

విద్యార్థులే వీధిలోకొచ్చెన్

పాఠశాలల కోసం ప్రభుత్వాలనే నిలదీసెన్

పేరెంట్స్.. ప్రశ్నించెన్

గురువులు అర్ధించెన్

అయినను..

తమ వైఖరి మార్చుకోని ప్రభుత్వాలు

విరిచెన్.. విరిచెన్

విద్యార్థులపై లాఠీలు విరిచెన్!


ఉచిత నిర్భంద విద్య అంటే అర్ధం..

నేడే తెలిసెన్..

నిర్దయగా..నిర్బంధించి

నిలువునా ముంచి అందించేదే విద్య..

అందరికీ ఉచిత విద్య..

అది ఎన్నేల్లైనా మన రాజ్యాంగంలో 

రాసుకున్న...మిథ్య!


ప్రభుత్వాలకు...

పథకాల పై ఉన్న ప్రేమ

పెట్రోల్ రేటు తగ్గించుటలో..లేదు

డబ్బును పంచటంలో ఉన్న..పరిణితి

ఉపాధి పెంచటం లో..లేదు

అప్పులు తేవటం లో ఉన్న ఆసక్తి

ఖర్చులు తగ్గించుటలో లేదు

ఆదాయం పెంచటంలో..లేదు


ప్రభుత్వాలే..పరాయి పంచన చేరుతుంటే

ప్రజలు కట్టే పన్నులతో నే..పంపకాలు చేస్తుంటే

రాబడి కోసం..రాజరికపు పద్ధతులే రాసుకొని..

కప్పం కుప్పలు కుప్పలుగా కట్టించుకొంటుంటే

పన్నులేసి...పన్నులు పీకుతుంటే


యే రాష్ట్రం..విరాజిల్లుతుంది?

యే ప్రజలు ప్రశాంతంగా ఉంటారు?


        ......రాజ్.....



Rate this content
Log in

Similar telugu poem from Tragedy