బాల్యమే గలగల పారే సెలయేరు
బాల్యమే గలగల పారే సెలయేరు
శీర్షిక :- బాల్యమే గలగలపారే సెలయేరు
రచన :-అంజనీగాయత్రి
Happy Teacher's day💐
🌹🌹🌹🌹🌹🌹
బాలలు బహు చక్కని
క్రీడలనాడుతూ బాల్యమున్
బాధ్యతలెరుగని జీవితం గడపంగా
అదియే అమూల్యమైన పెన్నిధిగన్
అపురూపంగా గడిపెదరు కదరా బాల.!
బాధరబందీలు లేకుండా పసిప్రాయపుమొగ్గలై ఇలలో గురువుల బోధలతో మెరయున్
బాలమేధావులు భవిత భారతమునన్
వెలుగొందురు కదరా బాల.!
మదినిమాటలతో పరవశింపజేయు
గురువుకు వందనము జేయగా
తరలిరండి బాలలారా బహువిధముల
గురువులను సత్కరింపగన్
బడికిబోవురోజులు గుర్తుచేయ
దినమునిదియే కదరా,బాల.!
గురుపూజోత్సవ దినమున
గురువులనతిభక్తితో కొలువంగ
వారి బోధనలే కొంగుబంగారమై
దేదీప్యమానమై వెలుగును శిష్యబృందము
వారి ఆశీర్వచనాలే ఎనలేని కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసే రత్నమాణిక్యాలు కదరా బాల.!
🌹🌹🌹🌹🌹🌹
