ఎప్పుడైనా నేను గుర్తొస్తే
ఎప్పుడైనా నేను గుర్తొస్తే
🌹ఎప్పుడైనా నేను గుర్తొస్తే🌹
రచన :- *అంజనీ*గాయత్రి*
నింగిలో మెరిసే తారకలా
ప్రభాతవేళ ఉషాకిరణంలా
మండేఎండలో నీడనిచ్చే తరువులా
పండువెన్నెలలో నిండు జాబిల్లిలా
వేదననుచల్లార్చే ప్రియసఖుడిలా
ఎప్పుడైనా నీకు నేను గుర్తొస్తానా!
సంధ్యారాగపు నులివెచ్చని కిరణంలా
శ్రావణమేఘపు వర్షపుచినుకులా
పచ్చనిచీరనుకట్టినప్రకృతిమాతలా
అనురాగాన్నికురిపించే వేళ అమ్మలా
వసంతమాసపు వేళ కూసే గండు కోయిలలా
ఎప్పుడైనా నీకు నేను గుర్తొస్తానా!
నింగిలో విరిసే హరివిల్లులా
ఉవ్వెత్తున ఎగసిపడే సాగరఘోషలా
నడిసంద్రాన సాగే నావలా
నామాటలు గలగలపారే సెలయేరులా
తుల్లుతూ తిరిగే తూనీగలా
ఎప్పుడైనా నీకు నేను గుర్తొస్తానా!
కల్మషమెరుగని బోసినవ్వుల పాపాయిలా
శిశిరంలో కురిసే మంచు బిందువులా
ఉరుకుల పరుగుల నదీమ తల్లిలా
ఎడారిలో ఒయాసిసులా
ఆకాశంలో రివ్వునఎగిరే విహంగ వీచికలా
ఎప్పుడైనా నీకు నేను గుర్తొస్తానా!
