బతుకు పోరాటం.
బతుకు పోరాటం.
ఆకలి పోరాటంలో
బక్క చిక్కిన బడుగు జీవులు
వారి రోదనలు వేదనగా
మిన్నంటిన ఆకలి కేకలు
జీవనగమంలో ఆగని పోరాటం
గుప్పెడు మెతుకులకై ఆరాటం
కడుపు నిండిన ధనికవర్గానికేమి ఎరుక
బడుగు జీవుల బతుకు పోరాటం
వేదనాభరితం అని వేలాదిమంది రోదనల
సారాంశం వారికి వినోదభరితం
ఒక రోజు వారి కడుపు మాడితే తెలుస్తుంది
బడుగు జీవుల ఆకలి కష్టాలు అరణ్య రోదనలు
ఆకలింపు చేసుకుని వారికి చేయూతనిస్తే
ధనిక వర్గపు సిరిసంపదల కన్నా వారికీర్తి
ఆకాశమంత ఎత్తు ఎదిగి చరిత్రలో చరితార్థులుగా మిగిలిపోతారు అనే జీవిత సత్యం తెలుసుకోవాలి.
