నవవసంతమే నూతన సంవత్సరం
నవవసంతమే నూతన సంవత్సరం
*నవవసంతమే నూతన సంవత్సరం*
* *రచన-అంజనీగాయత్రి*
నూతన సంవత్సరం వస్తూనే..
యువతలో ఉత్సాహాన్ని నింపుతూ..
అందరిలో చైతన్యాన్ని రప్పిస్తూ..
యువత ఎదలో ఆశలు ఎన్నో రేపుతూ...
ఆనందాల వెల్లువను అందరికీ సొంతం చేస్తూ..
ఆకాశానున్న
హరివిల్లునందుకునేలా
ఆకాశానికి నిచ్చెనలేస్తూ...
రైతన్నల ఆశలసౌధం అయిన పంటను సొంతంచేస్తూ..
కోటికాంతులు రైతన్న ఇంట వెలుగొందేలా చేస్తూ..
నూతన సంవత్సరంలో జరిగే పరీక్షల ఉత్తీర్ణతలో యువతని ప్రగతి పథాన నడుపుతూ...
లోకాన్ని ఉద్ధరించడానికి వచ్చిన నూతన సంవత్సరం లోకం పచ్చగా ఉండేలా చేస్తూ...
ఆనందాల హరివిల్లును ఇలపై ప్రసరింపజేసేలా..
నూతనవత్సర వేడుకలలో విద్యుద్దీపాలు మిరుమిట్లు గొలుపుతూ..
అందరి ఇల్లులను అలంకరణతో నందనవనం చేస్తూ..
ఇలలో వైకుంఠాన్ని తలపిస్తూ
నూతన సంవత్సరం వచ్చింది
కొత్త శోభను ప్రతిఇంటికి తెచ్చింది.!